మార్కెట్‌కు వెల్లేపనిలేదు.. ఇంట్లోనే ఇలా ఈజీగా తాజా కొత్తమీర పెంచుకోండి

02 July 2026

Anand T

కొత్తమీర.. ఇది కూరలకు టేస్ట్ ఇవ్వడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్‌లో కొనే పని లేకుండా మనం ఇంట్లోనే దీన్ని సింపుల్‌గా పెంచుకోవచ్చు. అదెలానో చూద్దాం.

కొత్తి మీరసాగు

మీరు ఇంట్లో కొత్తిమీర మొక్కలను నీటిలో, మట్టిలో.. ఈ రెండు పద్ధతుల్లోనూ పెంచవచ్చు. మీ వీలును బట్టి ఏ విధానాన్నైనా ఎంచుకోవచ్చు.

కొత్తి మీరసాగు

మీరు మట్టిలో కొత్తిమీర పెంచాలనుకుంటే, ముందుగా ఆ మట్టిలో ఎలాంటి రాళ్లు లేకుండా మెత్తటి మట్టిని సిద్ధం చేసుకోవాలి.

మట్టిలో ఇలా

ఇప్పుడు ధనియాలను తీసుకొని అరచేతుల మధ్య ఉంచి మెల్లగా నలపాలి. గింజలు నలిగి, రెండు బద్దలుగా మారేలా చూసుకోవాలి.

మిత్తనాలు సిద్దం

అలా రెండుగా చీల్చిన ధనియాల గింజలను రోజంతా నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గింజలు త్వరగా మొలకెత్తుతాయి.

నానబెట్టడం

నానిన గింజలను మట్టిలో ఒక సెంటీమీటర్ లోతులో పాతిపెట్టాలి. ఆ తర్వాత వాటిపై పలుచని మట్టి పొరను లేదా పీట్ నాచును వేసి మూయాలి.

విత్తనం నాటడం

గింజలు నాటిన తర్వాత మట్టి తేమగా ఉండేలా చేసుకోవాలి.. అయితే వాటర్ నేరుగా పోయకుండా స్ప్రే చేయాలి

 వాటర్ స్ప్రే

అంతే ఇలా మీరు సరైన సంరక్షణ అందిస్తే, కేవలం కొన్ని నెలల్లోనే మీ ఇంటి పెరటి నుండే తాజా, సువాసనభరితమైన కొత్తిమీర చేతికోస్తుంది. వాటిని మీరు నేరుగా వంటల్లో వాడుకోవచ్చు.

తాజా కొత్తిమీర