AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?

నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?

Phani CH
|

Updated on: Jul 01, 2026 | 7:01 PM

Share

2030 నాటికి భారత్‌లో నీటి డిమాండ్ అందుబాటులో ఉన్న సరఫరా కంటే రెండింతలు పెరగవచ్చని పీఎల్ క్యాపిటల్ హెచ్చరించింది. ఈ సవాలును ఎదుర్కొనేందుకు జల శుద్ధి, మురుగునీటి రీసైక్లింగ్, డీశాలినేషన్ వంటి రంగాల్లో దాదాపు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలు ఏర్పడనున్నాయని నివేదిక పేర్కొంది. నీటి సంరక్షణపై ప్రతి పౌరుడు దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కిచెబుతున్నారు.

భారతదేశం రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ‘పీఎల్ క్యాపిటల్’ తాజా నివేదిక పరకారం.. 2030 నాటికి దేశంలో అందుబాటులో ఉన్న నీటి సరఫరా కంటే డిమాండ్ రెట్టింపు స్థాయికి చేరుకోనుందని హెచ్చరిస్తోంది. అయితే, ఈ ముప్పునే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాబోయే దశాబ్దంలో సుమారు రూ.20 లక్షల కోట్ల భారీ పెట్టుబడి అవకాశాలు కూడా లభించనున్నాయని పేర్కొంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం వాటా ఉన్న భారత్‌లో, నీటి వనరులు మాత్రం 4 శాతమే ఉన్నాయి. వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, భూగర్భ జలాల క్షీణత వల్ల నీటి కొరత నానాటికీ తీవ్రమవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 72,000 మిలియన్ లీటర్లకు పైగా మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా, దానిని శుద్ధి చేసే సామర్థ్యం మనకు చాలా తక్కువగా ఉంది. ఈ సంక్షోభాన్ని అధిగమించాలంటే జల శుద్ధి, మురుగునీటి రీసైక్లింగ్, మురుగునీటి పారుదల మౌలిక సదుపాయాల రంగాలపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం, సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే డీశాలినేషన్ వంటి రంగాలకు దీర్ఘకాలికంగా భారీ డిమాండ్ ఏర్పడనుంది. మరోవైపు సరికొత్తగా వస్తున్న డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి పరిశ్రమలకు అత్యంత స్వచ్ఛమైన నీరు అవసరం కానుండటంతో పారిశ్రామికంగా నీటి డిమాండ్ మరింత పెరగనుంది. ఇతర రంగాల్లో పెట్టుబడులు కేవలం ఆర్థిక లాభాలతో ముడిపడి ఉండవచ్చు. కానీ, నీటి భద్రతకు సంబంధించిన పెట్టుబడులు దేశ సుస్థిర అభివృద్ధికి, భవిష్యత్తుకు అత్యంత తప్పనిసరి అని పీఎల్ క్యాపిటల్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’, ‘అమృత్ 2.0’ వంటి పథకాల ద్వారా నిధులు కేటాయిస్తోంది. అయితే, ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రతి పౌరుడు నీటిని వృధా చేయకుండా పునర్వినియోగించడం, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం వంటి చర్యల ద్వారా మాత్రమే ఈ నీటి ముప్పు నుండి దేశాన్ని కాపాడుకోగలము అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హోర్ముజ్ జలసంధిలో ‘మాయమవుతున్న’భారత నౌకలు.. చీకటిలో అసలేం జరుగుతోంది?

పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ

బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!

కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!

Follow Us