AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోర్ముజ్ జలసంధిలో 'మాయమవుతున్న'భారత నౌకలు.. చీకటిలో అసలేం జరుగుతోంది?

హోర్ముజ్ జలసంధిలో ‘మాయమవుతున్న’భారత నౌకలు.. చీకటిలో అసలేం జరుగుతోంది?

Phani CH
|

Updated on: Jul 01, 2026 | 7:00 PM

Share

ఇరాన్ నుంచి పెరుగుతున్న భద్రతా ముప్పు కారణంగా హోర్ముజ్ జలసంధి గుండా భారత్‌కు వస్తున్న అనేక వాణిజ్య నౌకలు తమ AIS ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేసి ‘గోయింగ్ డార్క్’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దాడుల నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటుండగా, ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాపై దీని ప్రభావం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

హోర్ముజ్ జలసంధి.. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. కానీ, ప్రస్తుతం ఈ మార్గం అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని వణికిస్తోంది. . ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పు కారణంగా, భారత్‌కు వస్తున్న వందలాది నౌకలు తమ ట్రాకింగ్ సిస్టమ్స్‌ను ఆపేస్తున్నాయి. దీన్నే ‘గో డార్క్’ అంటారు. అసలు ఈ నౌకలు ఎందుకు చీకటిలోకి వెళ్తున్నాయి? అక్కడ ఏం జరుగుతోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా సముద్రంలో ప్రయాణించే ఏ నౌకైనా తన గుర్తింపు, ఖచ్చితమైన స్థానం, వేగం మరియు గమ్యస్థానాన్ని ఇతర నౌకలకు, నియంత్రణ కేంద్రాలకు నిరంతరం ప్రసారం చేయడానికి ‘ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’ (AIS) ట్రాన్స్‌పాండర్‌లను ఉపయోగిస్తుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.ఇరాన్ దాడుల భయంతో దాదాపు 62% నౌకలు ఈ జలసంధి గుండా వెళ్లేటప్పుడు తమ సిగ్నల్స్‌ను ఆపేస్తున్నాయి. అంటే తమను ఎవరూ గుర్తించకూడదని అజ్ఞాతంలోకి వెళ్తున్నాయి. “గూఢచర్య సమాచారం, అంతర్జాతీయ సముద్ర నిఘా సంస్థ ‘కెప్లర్ ‘ (Kpler) విడుదల చేసిన నివేదికలు ఈ సంచలన విషయాలను బయటపెట్టాయి. యుద్ధ వాతావరణం, శత్రు దేశాల దాడుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు… శత్రువుల కంటికి చిక్కకుండా ఉండటానికి నౌకలు తమ ట్రాకింగ్ వ్యవస్థలను పూర్తిగా ఆపివేస్తాయి. అంతర్జాతీయ నౌకాయాన పరిభాషలో ఈ రహస్య ప్రయాణ పద్ధతిని “గోయింగ్ డార్క్” అని పిలుస్తారు. ప్రస్తుతం భారతదేశానికి వచ్చే నౌకలు ఇరాన్ దాడుల నుండి తప్పించుకోవడానికి ఈ వ్యూహాన్నే అమలు చేస్తున్నాయి. ఇలా ఎందుకంటే.. మే 1 నుండి జూన్ 25 మధ్య కాలంలో భారతదేశానికి రావాల్సిన మొత్తం 73 వాణిజ్య నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించగా, వాటిలో ఏకంగా 45 నౌకలు తమ సమాచారాన్ని పూర్తిగా దాచిపెట్టి ‘డార్క్’ మోడ్‌లో ప్రయాణించాయి. భారతదేశానికి సరుకు చేరవేసే పనామా, లైబీరియా, యూఏఈ, మార్షల్ దీవుల జెండాలు కలిగిన సుమారు 69 నౌకలు కూడా ఇదే విధంగా జలసంధిలో కరెంట్ కట్ చేసుకుని ప్రయాణించాయి. దీనికి కారణం ఇరాన్- పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే. అయితే, దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా నౌకలు ఒమన్ తీరం గుండా వెళ్తున్నాయి. అమెరికా, ఒమన్ మరియు అంతర్జాతీయ సంస్థల మద్దతుతో ఈ మార్గాన్ని సురక్షితమని భావించారు. కానీ, ఇది కూడా సురక్షితం కాదని తేలింది. ఎందుకంటే, మే నెలలో ఒమన్ దగ్గర భారత జెండా ఉన్న ఒక సరుకు రవాణా నౌక సముద్రంలో మునిగిపోయింది.. దీనికి కూడా ఇరాన్ దాడులే కారణమని అనుమానిస్తున్నారు.”ఈ మార్గంలో అమెరికా నౌకాదళాల రక్షణ ఉన్నప్పటికీ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక, గత ఫిబ్రవరి చివరి వారం నుండి హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు అత్యంత అనిశ్చితంగా మారాయి. ఇరాన్ తరచుగా తన నౌకాయాన మార్గదర్శకాలను మారుస్తూ అంతర్జాతీయ నౌకలను అయోమయానికి గురిచేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇరాన్ రక్షణ దళాల నుండి అధికారిక అనుమతులు లభించిన తర్వాత కూడా నౌకలపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఇరాన్ అనుమతి ఇచ్చినా సరే, భారత నౌకలపై కూడా దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు, ఏప్రిల్ లో జరిగిన ‘సన్మార్ హెరాల్డ్’ ఘటన. ఇరాన్ నేవీ అనుమతి ఇచ్చినప్పటికీ ఆ నౌక దాడికి గురైంది.” “మొత్తానికి, ఇరాన్ నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో నౌకల ప్రయాణం ఒక సాహసంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియక, భారత ఇంధన, ఇతర ముఖ్యమైన వాణిజ్య సరుకులు ఈ మార్గం గుండానే రావాల్సి ఉండటంతో, ఈ నౌకలు చీకటిలో ప్రయాణం చేయక తప్పడం లేదు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు భారత ఆర్థిక ,రక్షణ రంగాలకు పెద్ద సవాలుగా మారాయి. ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలి.”

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ

బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!

కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

వందల కోట్ల బడ్జెట్.. కానీ 1% సక్సెస్! మునుగుతున్న టాలీవుడ్‌!

8 ఏళ్లుగా అత్త న్యాయ పోరాటం.. కోడలికి 7 ఏళ్ల జైలు శిక్ష!

Follow Us