డిజిటల్ లావాదేవీలు పెరిగినందున సైబర్ మోసాలు అధికమవుతున్నాయి. మీ డబ్బుకు భద్రత కల్పించేందుకు కొన్ని బ్యాంకులు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. అనధికార లావాదేవీలు, ఫిషింగ్ దాడులు, హ్యాకింగ్, ఏటీఎం దోపిడీ వంటి వాటి నుండి ఇది రక్షణ ఇస్తుంది. ప్రీమియం బట్టి పాతిక వేల నుండి కోటి రూపాయల వరకు పరిహారం పొందవచ్చు. మోసం జరిగిన వెంటనే బ్యాంకుకు, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయడం తప్పనిసరి. పిన్, ఓటీపీ షేర్ చేస్తే మాత్రం పరిహారం అందదు.