AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investments: నెలకు రూ.12,500 పొదుపు చేస్తే చాలు.. రూ.కోటి మీ సొంతం.. ఈ పథకం గురించి తెలుసా..?

నెలకు రూ.12,500 పొదుపు చేసుకుని రూ.కోటి సంపాదించాలనుకుంటున్నారా.. అయితే ఇందుకు ఒక మార్గం ఉంటుంది. కానీ ఇందుకు 24 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు పెట్టుబడి పెడితే 24 ఏళ్ల తర్వాత రూ.కోటి అవుతాయి. ఎలాంటి రిస్క్ లేకుండా మీరు రూ.కోటి సంపాదించవచ్చు.

Investments: నెలకు రూ.12,500 పొదుపు చేస్తే చాలు.. రూ.కోటి మీ సొంతం.. ఈ పథకం గురించి తెలుసా..?
Ppf
Venkatrao Lella
|

Updated on: Jul 02, 2026 | 6:00 AM

Share

డబ్బులు పొదుపు చేసుకుని ఆదాయం పొందేందుకు దేశంలో అనేక మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, ప్రభుత్వం బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, పాలసీలతో పాటు ప్రభుత్వ పొదుపు పథకాలు కూడా చాలానే ఉందుబాటలో ఉంటాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే నష్టాలు వస్తాయనే ఉద్దేశంతో ప్రజలు తరచుగా పెట్టుబడి పెట్టడానికి భయపడుతుంటారు. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా కాస్త రిస్క్ ఉంటుంది. కానీ ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్‌లలో ఎలాంటి రిస్క్ ఉండదు. మీ డబ్బులకు కేంద్ర ప్రభుత్వ హామీ ఇస్తుండటంతో భద్రత ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వంలో మీరు ప్రతి నెలా కేవలం రూ.12,500 ఆదా చేస్తే 24 సంవత్సరాల్లో సులభంగా రూ. కోటి వరకు సంపాదించుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 24 ఏళ్లల్లో రూ.కోటి సంపాదించవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ పథకంలో వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఉదాహరణకు మీ వయస్సు ఇప్పుడు 25 ఏళ్లు అనుకుందాం. మీరు పీపీఎఫ్‌లో నెలకు రూ.12,500 పెట్టుబడి పెట్టాలి. అంటే సంవత్సరానికి రూ.1.50 లక్షలు జమ చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత మీకు 40 ఏళ్ళ వయస్సులో ఇది మెచ్యూర్ అవుతుంది. ఈ 15 సంవత్సరాల్లో మీరు మొత్తం రూ.22,50,000 జమ చేసి ఉంటారు. వడ్డీ రూపంలో మీకు రూ.18,18,209 లభిస్తుంది. అంటే ఒకేసారి రూ.40,68,209 అందుతుంది. పీపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీ లేదా మెచ్యూరిటీ సొమ్ముపై ఎలాంటి పన్ను ఉండదు. దీంతో మొత్తం సొమ్ము నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

రూ.కోటి సంపాదించాలంటే..?

మీ పీపీఎఫ్ ఖాతా నుండి మీకు లభించే రూ.40,68,209ని మీరు ఖర్చు చేయకండి. దీనిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి పెట్టండి. సంవత్సరానికి 12 శాతం సాధారణ దీర్ఘకాలిక రాబడి వచ్చినా.. ఈ డబ్బు కేవలం 9 ఏళ్లల్లో రూ. 1,10,92,315 అవుతుంది. ఈ విధంగా 24 సంవత్సరాల్లో మీరు రూ.1 కోటి సంపాదించవచ్చు. డబ్బులు పొదుపు చేసుకుంటూ దీర్థకాలంలో బాగా రాబడి పొందాలనుకునేవారికి ఇది మంచి మార్గంగా చెప్పవచ్చు. డబ్బులు పొదుపు చేసుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఎలా పొదుపు చేసుకోవాలి.. ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయాలు చాలామందికి తెలియవు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!