ఆ స్టార్ హీరో నుంచి కాజల్‌కు లవ్ ప్రపోజల్! చందమామ ఏం చేసిందంటే?
01 July 2026
Basha Shek
పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది కాజల్ అగర్వాల్. అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపిస్తోందీ టాలీవుడ్ చందమామ
ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ఎన్బీకే 111 (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు
ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కాజల్. ముఖ్యంగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
అప్పట్లో ఈ టాలీవుడ్ చందమామ అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. అయితే ఇలా కాజల్ అగర్వాల్ అందానికి పడిపోయిన వారిలో ఒక స్టార్ హీరో కూడా ఉన్నాడట
ఆ మధ్యన ఒక సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కాజల్, ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. షూటింగ్ సమయంలో ఒక పాపులర్ హీరో తనకు ప్రపోజ్ చేశాడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే, ఆ స్టార్ హీరో పేరు మాత్రం బయటపెట్టలేదు కాజల్ అగర్వాల్. దీంతో ఆ హీరో ఎవరబ్బా అని నెటిజన్లు తలలు గోక్కుంటున్నారు.
కాగా కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది. 2022లో ఈ దంపతులకు నీల్ కిచ్లూ అనే బాబు జన్మించాడు
కాగా బాలయ్యతో కాజల్ నటించడం ఇది రెండోసారి. గతంలో భగవంత్ కేసరి సినిమాలో వీరు కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.