AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ఆకట్టుకుంటున్న గెలాక్సీ A27 ఫీచర్లు

ప్రముఖ టెక్ దిగ్గజం శామ్​సంగ్ తన ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలతో, మెరుగైన పనితీరును అందించేలా రూపొందించిన ఈ డివైజ్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. సుదీర్ఘకాలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, పటిష్టమైన భద్రతా ఫీచర్లతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ నేటి తరం వినియోగదారుల అవసరాలను తీర్చేలా ఉంది.

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ఆకట్టుకుంటున్న గెలాక్సీ A27 ఫీచర్లు
Samsung Galaxy A27 5g.jpg
Nikhil
|

Updated on: Jul 01, 2026 | 11:10 PM

Share

గూగుల్ జెమిని, పెర్‌ప్లెక్సిటీ వంటి ఏఐ సర్వీసులతో వస్తున్న ఈ కొత్త ఫోన్, వినియోగదారుల అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్‌తో కూడిన ఈ డివైజ్ ధర, ఇతర ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం.

డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్

గెలాక్సీ ఏ27 5జీలో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్‌ఫినిటీ-ఓ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్‌ను ఉపయోగించారు. ఫోన్ పనితీరు కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌ను అమర్చారు. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు సహకరిస్తాయి.

ఏఐ కెమెరా, స్మార్ట్ ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50 ఎంపీ మెయిన్ కెమెరా (OIS సపోర్ట్), 5 ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం ముందు 12 ఎంపీ హెచ్‌డీఆర్ కెమెరా ఇచ్చారు. ఆబ్జెక్ట్ ఎరేజర్, ఎడిట్ సజెషన్స్ వంటి ఏఐ ఎడిటింగ్ టూల్స్‌తో ఫోటోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. గూగుల్ సర్కిల్ టు సెర్చ్, రియల్-టైమ్ వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ (22 భాషల్లో) వంటి ఫీచర్లు దీని సొంతం.

బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్

5,000mAh భారీ బ్యాటరీ రోజంతా నిరంతరాయంగా పనిచేస్తుంది. విశేషమేమిటంటే, ఈ ఫోన్‌కు ఏకంగా ఆరు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను శామ్​సంగ్ అందిస్తోంది. శామ్​సంగ్ నాక్స్, నాక్స్ వాల్ట్ ద్వారా ఫోన్‌లోని డేటాకు అత్యున్నత భద్రత ఉంటుంది.

ధర, లభ్యత

ఈ ఫోన్ లైట్ గ్రీన్, లైట్ పింక్, బ్లాక్ రంగుల్లో జూలై 3 నుంచి అందుబాటులోకి రానుంది.

  • 6GB + 128GB: రూ. 28,999
  • 8GB + 128GB: రూ. 31,999
  • 8GB + 256GB: రూ. 37,499

లాంచ్ ఆఫర్లలో భాగంగా యూపీఐ లేదా బ్యాంక్ లావాదేవీలపై రూ. 3,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా, ఎంపిక చేసిన ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా 15 నెలల జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది. ప్రీమియం ఫీచర్లు, సుదీర్ఘమైన సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.

Follow Us