Horoscope Today: ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దినఫలాలు (నవంబర్ 1, 2023): మేష రాశి వారికి బుధవారంనాడు ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. వృషభ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 01st November 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 01, 2023 | 6:16 AM

దినఫలాలు (నవంబర్ 1, 2023): మేష రాశి వారికి బుధవారంనాడు ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. వృషభ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఈ రాశిలో ఉన్న గురువు భాగ్య స్థానాన్ని చూస్తున్నందువల్ల అనేక నిర్ణయాలు, ప్రయత్నాలు సానుకూలపడతాయి. బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. దైవకార్యాల్లో పాల్గొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాహువు లాభ స్థానంలోనూ, రాశ్యధిపతి శుక్రుడు నాలుగవ స్థానంలోనూ బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల అనేక విధాలుగా సమయం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు ఎదురుండదు. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురు, బుధ సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా, వృత్తి, ఉద్యోగాల్లో వ్యక్తిగత ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రమోషన్ లభించడం గానీ, జీతభత్యాలు పెరగడం గానీ జరుగుతుంది. వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ సమస్యలు బాగా తగ్గు ముఖం పడతాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు మంచి ఫలితాలను తెచ్చుకుంటారు. ఆరోగ్యం అన్ని విధాలు గానూ అనుకూలంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శుభ గ్రహాలు కొద్దిగా ప్రతికూలంగా ఉండడం, అష్టమ శని కొనసాగుతుండడం వంటి కారణాల వల్ల ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి స్తబ్ధత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది. గతంలో మీ సహాయం పొందినవారు అవసర సమయాల్లో ముఖం చాటేస్తారు. ఆరోగ్యం పరవా లేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గురు, బుధ, శుక్రులు పూర్తిగా అనుకూలంగా ఉన్న కారణంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహయ సహకారాలు అందుతాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారం చేపట్ట డానికి అవకాశముంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభిస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాశ్యధిపతి బుధుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నప్పటికీ, ఈ రాశిలో ప్రవేశించిన కేతువు వల్ల కొద్దిపాటి సమస్యలు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా సమస్యలున్నా వాటిని అధిగమిస్తారు. అధికారుల ఆదరణ పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గురువు, శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. వ్యక్తిగత పురోగతి విషయంలో ముఖ్యమైన నిర్ణ యాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

భాగ్య స్థానంలో శుక్రుడు, దశమంలో కేతువు ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధ్యమవుతుంది. ఉద్యోగంలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ఆర్థిక వ్యవహారాల్లో టెన్షన్ తప్పకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. పిల్లల విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండక పోవచ్చు. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పూర్తి చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గురు బలం బాగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. విదే శాల నుంచి ఉద్యోగాలపరంగా ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కొందరు మిత్రులకు సాయం చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం, ఆరోగ్యం సానుకూలంగా సాగిపోతాయి. ధన స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడు బలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. వృత్తి, ఉద్యో గాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాల్లో బాగా దూసుకుపోతారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సప్తమంలో శుక్రుడు, భాగ్య స్థానంలో బుధ, రవుల సంచారం వల్ల కొన్ని కీలక అంశాలు అను కూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థి తులు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇతరుల బాధ్యతలను పంచుకోవడం జరుగు తుంది. కొందరు బంధువులు, సన్నిహితులతో అపార్థాలు తొలగిపోయి, సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

గురు బలం బాగా అనుకూలంగా ఉంది. ఇంటా బయటా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ లాభం ఎక్కు వగా ఉంటుంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.