Horoscope Today: ఈ రోజు ఈ రాశి స్త్రీలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (October 1st 2021): కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటిల్లో జాతక ఫలాలు ఒకటి. అవును కొందరు.. తాము ఏ పని మొదలు పెట్టాలన్నా .. ఈరోజు మన జాతకం ఎలా ఉంది అని..

Horoscope Today: ఈ రోజు ఈ రాశి స్త్రీలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2021 | 7:25 AM

Horoscope Today (October 1st 2021): కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటిల్లో జాతక ఫలాలు ఒకటి. అవును కొందరు.. తాము ఏ పని మొదలు పెట్టాలన్నా .. ఈరోజు మన జాతకం ఎలా ఉంది అని ఆలోచిస్తారు. తమ నక్షత్రాన్ని బట్టి.. ఏ పనులు చేస్తే మంచి ఫలితాలను పొందుతాము అని ఆలోచిస్తూ.. జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉన్నారు.  అంతేకాదు తాము పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 1వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారికి  ఈరోజు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం శ్రేయస్కరం. తినే ఆహారం వలన అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. మనోద్వేగానికి గురవుతారు.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు పరిస్థితులను మీ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న తగువులు ఏర్పడే అవకాశం ఉంది.  బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశివారికి అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. ఆర్ధికంగా బలపడతారు. స్త్రీలు సంతోషంగా ఉంటారు. ఆర్ధికంగా బలపడతారు.  విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

సింహ రాశి: ఈరాశివారు ఈరోజు వ్యాపారంలో ధననష్టం పొందే అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు చేస్తారు. తోటివారితో విరోధం ఏర్పడకుండా ఉండడం మంచిది. స్త్రీలు తగిన విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  మానసికంగా ఆందోళన చెందుతారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరాశి స్త్రీలు అనారోగ్య బాధలను ఎదుర్కొనే అవకాశం ఉంది. బంధు మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

తులా రాశి: ఈ రాశివారికి ఈరోజు ఆకస్మిక ధన వ్యయం చేస్తారు. ఋణం తీసుకొనే ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పుని కోరుకుంటారు. విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేదు. బంధు, మిత్రలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. సహనం అన్ని విధాలా మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి:ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో సంతోషం కలుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో అభివృద్ధి సాధిస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది.

కుంభ రాశి: ఈరాశి వారు ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఎలర్జీతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఋణలాభం ఉంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు.

Also Read: శత్రువైనా సరే కష్టంలో ఉన్నానంటూ మనదగ్గరకు వస్తే.. సాయం చేయాలంటున్న భీష్ముడు