Guru Gochar 2024: వృషభ రాశిలోకి గురు గ్రహం.. దుస్థానంలో ఉన్నా ఆ రాశుల వారికి ధన యోగమే!
జ్యోతిష శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా చెప్పుకునే గురు గ్రహం మే 1వ తేదీ నుంచి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తోంది. ఈ గ్రహం ఇక్కడ ఏడాది పాటు సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు అధిపతి అయిన వృషభ రాశిలో గురువు సంచరించడం వల్ల అధికార దాహం, ధన దాహం బాగా పెరుగుతాయి. ప్రతి రాశి వ్యక్తీ ఈ రెండు విషయాల్లో తమ ప్రణాళికలను మార్చుకుంటారు.
జ్యోతిష శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా చెప్పుకునే గురు గ్రహం మే 1వ తేదీ నుంచి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తోంది. ఈ గ్రహం ఇక్కడ ఏడాది పాటు సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు అధిపతి అయిన వృషభ రాశిలో గురువు సంచరించడం వల్ల అధికార దాహం, ధన దాహం బాగా పెరుగుతాయి. ప్రతి రాశి వ్యక్తీ ఈ రెండు విషయాల్లో తమ ప్రణాళికలను మార్చుకుంటారు. ఎవరికి వీలైన ప్రయత్నాలు వారు చేసుకుంటారు. కొన్ని రాశుల వారికి అత్యుత్తమ ఫలితాలనిచ్చినప్పటికీ, మరొకొన్ని రాశుల వారికి కూడా కొన్ని మంచి అవకాశాలు అంది వచ్చే అవకాశముంది. మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి కూడా వృషభ గురువు కొన్ని సత్ఫలితాలనివ్వడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశివారికి ఇంత వరకూ లాభ స్థానంలో ఉండి అనేక ధన యోగాలు కలిగించిన గురువు ప్రస్తుతం వ్యయ స్థానమైన వృషభ రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. సంపాదించిన డబ్బును పొదుపు చేసుకోవడం, ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మొదలవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ నిలకడగా ఉంటుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద మాత్రమే ఖర్చుచేయడం జరుగు తుంది.
- సింహం: వచ్చే 12 నెలల కాలంలో మీ వృత్తి, ఉద్యోగాల తీరుతెన్నులు గణనీయంగా మారిపోతాయి. పదోన్నతులకు, కొత్త ఉద్యోగావకాశాలకు మార్గం సుగమం అవుతుంది. తప్పకుండా నాయకత్వ స్థాయి ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి ఇంత కన్నా అనుకూల సమయం మరొకటి ఉండక పోవచ్చు. నిరుద్యోగులు సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశముంది. ఆదాయ పరి స్థితిలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది. ఆర్థిక ప్రాధాన్యం ఉన్న ఉద్యోగాల్లో చేరడం జరుగు తుంది.
- తుల: ఈ రాశివారిలో పైకి కనిపించని ప్రతిభా పాటవాలు వ్యక్తం కావడం ప్రారంభిస్తాయి. ఉద్యోగాల పరంగా కొత్త అవకాశాలు అంది వస్తాయి. స్థాన చలనాలకు అవకాశం ఉంది. వారసత్వ సంపద దక్కుతుంది. అనేక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించ డానికి, పెట్టుబడులు పెట్టడానికి అవకాశముంది. ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ కొత్త నైపుణ్యాలను ప్రవేశపెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
- ధనుస్సు: ఉద్యోగంలో పదోన్నతులకు ఆటంకాలు ఉండవచ్చు కానీ, సంపాదన మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. స్వయం ఉపాధిని చేపట్టే అవకాశం కూడా ఉంది. మీ నైపుణ్యాలకు, ప్రతిభకు, మీ ఆసక్తులకు తగ్గ ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించే సూచనలున్నాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా కాలానుగుణంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు.
- కుంభం: ఉద్యోగ జీవితం పూర్తిగా మారిపోయే అవకాశముంది. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ధన సంపాదన మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కుటుంబ వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం, మద్యం వ్యాపారం వంటి వాటిలోకి మారే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త ఇల్లు, కొత్త వాహనం అమరే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకుని, మదుపు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పరమ పిసినార్లుగా మారే సూచనలున్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
- మీనం: మీ నైపుణ్యాలను, విషయ పరిజ్ఞానాన్ని, మీ అర్హతలను పెంచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. తృతీయ స్థానంలో ఉన్న గురువు వల్ల మీరు ఉద్యోగపరంగానే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించే అవకాశముంది. పదోన్నతులకు, మంచి పరిచయాలకు, ఒక సంస్థకు అధిపతి కావడానికి అవకాశాలు బాగా ఉన్నందువల్ల జీవితం హోదాపరంగా, సంపద పరంగా బాగా మారిపోయే అవకాశముంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. అందుకు సిద్ధంగా ఉండాలి.