May Horoscope: మే నెలలో రాశి మారనున్న నాలుగు కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!

May 2024 Astrology: మే నెలలో గురువు, కుజుడు, బుధుడు, రవి రాశులు మారుతున్నందువల్ల ఆరు రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనేక ఆదాయ, ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. అనారోగ్యాల నుంచి కూడా చాలావరకు ఉపశమనం లభించి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి కావడం మొదలవుతుంది.

May Horoscope: మే నెలలో రాశి మారనున్న నాలుగు కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!
May 2024 Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 29, 2024 | 11:37 AM

మే నెలలో గురువు, కుజుడు, బుధుడు, రవి రాశులు మారుతున్నందువల్ల ఆరు రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనేక ఆదాయ, ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. అనారోగ్యాల నుంచి కూడా చాలావరకు ఉపశమనం లభించి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి కావడం మొదలవుతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతగా సత్ఫలితాలను అనుభవించడం జరుగుతుంది. తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా శుభ వార్తలు వినడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ ఫలితాలు అందబోతున్నాయి.

  1. మేషం: కుజుడు అధిపతి అయిన ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టం పండబోతోంది. పురోగతి సాధిం చడానికి అనేక అవకాశాలు అంది వస్తాయి. జీవితంలో ఏదో విధంగా అభివృద్ధిని సాధించాలనే తాపత్రయం, యాంబిషన్ ఎక్కువగా ఉండే ఈ రాశివారు తమ కలల సాఫల్యానికి మరింతగా కృషి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాకుండా, వృత్తి, వ్యాపారాల్లో సైతం కొత్త ఆలోచనలను, కొత్త నిర్ణయాలను ప్రవేశపెట్టి లబ్ధి పొందడం జరుగుతుంది. ఆదాయం అంచనాలకు మించి కలిసి వస్తుంది.
  2. మిథునం: సహజమైన ప్రతిభా పాటవాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమయస్ఫూర్తి ఎక్కువగా ఉండే ఈ రాశివారు వ్యక్తిగత పురోభివృద్ధికి సంబంధించిన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టే అవకాశముండదు. బుద్ధికారకుడైన బుధుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల తమ ప్రతిభా పాటవాలను, పట్టు దలను పూర్తిగా పణంగా పెట్టి కొత్త అవకాశాలను సృష్టించుకోవడం కూడా జరుగుతుంది. లాభ దాయక పరిచయాలను పెంపొందించుకుంటారు. కెరీర్ తో పాటు ఆదాయ వృద్ధి కూడా ఉంటుంది.
  3. సింహం: ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే ఈ రాశివారికి ఈ నెలలో ఊహించని స్థాయిలో అదృష్టం పండబోతోంది. శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉండే ఈ రాశ్యధిపతి రవి కారణంగా వీరు ఏ రంగంలో ఉన్నా ఒక వెలుగు వెలగడానికి అవకాశముంది. అధికారం చేపట్టడం గానీ, ఒక సంస్థకు అధిపతి కావడం గానీ జరుగుతుంది. ప్రాజెక్టులు చేపట్టడంలో నిష్ణా తులవు తారు. ఎంత శ్రమకైనా సిద్ధపడి ఆదాయాన్ని పెంచుకుంటారు. సౌకర్యాల మీద దృష్టి పెడతారు.
  4. తుల: సమతూకంగా, సమతూకంగా, ‍లౌకికంగా వ్యవహరించే శుక్రుడు ఈ రాశికి అధిపతి అయినందు వల్ల, ఈ శుక్రుడు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నందువల్ల, ఒక ప్రణాళిక ప్రకారం అనేక అవకాశా లను సృష్టించుకుంటారు. సాధారణంగా అదృష్టమే వీరి వెంట పడుతుంది. కనీ వినీ ఎరుగని స్థాయిలో ఆదాయ వృద్ధి ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాలను ఏర్పరచుకుంటారు. మే నెలంతా వీరు తమ నైపుణ్యాలను పెట్టుబడిగా పెట్టి, అత్యధికంగా లాభాలు గడిస్తారు. హోదాను పెంచుకుంటారు.
  5. ధనుస్సు: సాహసాలు చేయడానికి ఇష్టపడే ఈ రాశివారికి ధన కారకుడైన గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మే నెలలో వీరు ఏ ప్రయత్నం చేపట్టినా ఘన విజయాలు సాధిస్తారు. వీరి సాహస ప్రవృత్తి కారణంగా వీరికి అనేక ఉద్యోగావకాశాలు, వ్యాపారావకాశాలు, ఆదాయ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ముందంజ వేస్తారు. రాజీలేని ధోరణిలో వ్యవహరించి ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. కెరీర్ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం సంపాదించుకుంటారు.
  6. మకరం: ఎంత శ్రమకైనా, ఒత్తిడికైనా వెనుకాడని ఈ రాశివారికి మే నెలంతా నల్లేరు మీద బండిలా సాగి పోతుంది. క్రమశిక్షణకు, పట్టుదలకు మారుపేరైన శనీశ్వరుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల ప్రతి అవకాశాన్నీ కష్టపడి సంపాదించుకుంటారు. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. వీరి పట్టుదల కారణంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనారోగ్యం నుంచి కూడా బయటపడతారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?