Guru Gochar 2023: ఇక వారికి దండిగా గురువు అనుగ్రహం.. జీవితంలో మ్యాజిక్ జరిగినట్లు పలు మార్పులు..!

Jupiter Transit 2023: ఏప్రిల్ 23వ తేదీన గురు గ్రహం మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సహజమైన శుభగ్రహంగా పేరు ఉన్న గురుగ్రహం ఏ రాశులకైనా వీలైనంతవరకు శుభ ఫలితాలే ఇస్తాడు. దుస్థానాలలో ఉన్నప్పుడు కూడా చాలావరకు మంచి చేయడానికే ప్రయత్నిస్తాడు.వ్యక్తిగత జాతక చక్రంలో ఏ విధంగా ఉన్నప్పటికీ గోచారంలో మాత్రం ఏ రాశిలో ఉన్నప్పటికీ కొద్దో గొప్పో మంచి చేయడానికే అవకాశం ఉంది.

Guru Gochar 2023: ఇక వారికి దండిగా గురువు అనుగ్రహం.. జీవితంలో మ్యాజిక్ జరిగినట్లు పలు మార్పులు..!
Guru Gochar 2023 PhalaluImage Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 21, 2023 | 4:48 PM

ఈ నెల 23వ తేదీన ఉదయాత్పూర్వం గురు గ్రహం మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సహజమైన శుభగ్రహంగా పేరు ఉన్న గురుగ్రహం ఏ రాశులకైనా వీలైనంతవరకు శుభ ఫలితాలే ఇస్తాడు. దుస్థానాలలో ఉన్నప్పుడు కూడా చాలావరకు మంచి చేయడానికే ప్రయత్నిస్తాడు. వ్యక్తిగత జాతక చక్రంలో ఏ విధంగా ఉన్నప్పటికీ గోచారంలో మాత్రం ఏ రాశిలో ఉన్నప్పటికీ కొద్దో గొప్పో మంచి చేయడానికే అవకాశం ఉంది. అయితే, మొత్తం 12 రాశులలో ఆరు రాశుల వారికి గురువు విపరీత రాజయోగాన్ని పట్టించే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. మేషం, మిధునం, సింహం, తుల, ధనస్సు, మీనరాశి వారికి ఈ ఏడాది గురువు అనేక శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. మిగిలిన రాశుల వారికి ఒక మోస్తరుగా మాత్రమే శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. శుభ ఫలితాలను పొందనున్న ఆరు రాశులకు సంబంధించి ప్రముఖ జ్యోతిష్య పండితులు కౌశిక్ అందిస్తున్న వివరాలు..

మేష రాశి

ఈ రాశి వారికి గురువు మార్పు అనేక శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. ఉద్యోగం, వృత్తి, ఆదాయం, కుటుంబం, వివాహం, సంతానం వంటి విషయాలలో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. విదేశాలలో ఉద్యోగం, ఉద్యోగంలో ప్రమోషన్, నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగ స్థిరత్వం వంటివి తప్పకుండా జరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకోవ డానికి అవకాశం ఉంది. ఇటువంటి వృత్తి నిపుణులు తమ తమ రంగాలలో ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం సంపాదించుకునే సూచనలు ఉన్నాయి. వీరికి ఒక్క క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలం అవుతాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మిథున రాశి

ఈ రాశి వారికి లాభ స్థానంలో అంటే 11వ స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో చక్కని పురోగతికి అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. ప్రమోషన్లు, అధికార యోగం, అధిక ఆదాయం, ప్రముఖులతో పరిచయం వంటివి తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మరింత మెరుగైన ఉద్యోగం కోసం, మరింత ఎక్కువ ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులు తాము కోరుకున్న ఉద్యోగాలలో చేరటానికి అవకాశం కలుగుతుంది. అనుకో కుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. జీవితం మంచి మలుపు తిరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. సంతానం కలగడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు.

సింహ రాశి

ఈ రాశి వారికి భాగ్య స్థానంలో గురువు ప్రవేశిం చడం వల్ల అనుకోని విధంగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. విదేశాలలో చదువు, ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. వీసా సమస్యలు ఏమైనా ఉంటే అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవటానికి ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా సత్ఫలి తాలను ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ వడ్డీ వ్యాపారం షేర్లు ఆర్థిక లావాదేవీలు వంటి రంగాలలో ఉన్న వారికి ఎంతగానో కలిసి వస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంపన్నుల కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. చిన్నపాటి ప్రయత్నం కూడా చక్కని అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ప్రయత్నాలు ఆలోచనలు, తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి.

తులా రాశి

ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్న గురువు వల్ల ఆర్థిక పరిస్థితుల్లో ఊహించనంతగా మార్పు వచ్చే అవకాశం ఉంది. అనుకోని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి స్థిరత్వం ఏర్పడు తుంది. ఇంతవరకు ఇతరుల నుంచి ఆర్థికంగా సహాయం పొందిన వారు ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే అవి అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల వల్ల లబ్ధి పొందుతారు. భాగస్వాములతో విభేదాలు, వివాదాలు సమసిపోతాయి. విదేశీయానానికి అవకాశం ఉంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి కలిసి వస్తుంది. సంపదవృద్ధి చెందుతుంది.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి పంచమ స్థానంలో ప్రవేశిస్తున్న గురువు వల్ల వృత్తి ఉద్యోగాలపరంగా అధికార యోగానికి, అనూహ్యమైన పురోగతికి అవకాశం ఏర్పడుతుంది. ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. సంతానం వృద్దిలోకి వస్తుంది. ఇంతవరకు సంతానం లేనివారికి సంతానయోగం పడుతుంది. ఈ రాశి వారి ఆలోచనలు ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలి తాలను ఇస్తాయి. వీరి సలహాలు, సూచనలకు సర్వత్రా విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అభివృద్ధి చెందుతాయి. ఆశించిన స్థాయిలో ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ రాశి వారు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత మంచిది. కొద్దిపాటి ప్రయత్నంతో అధికారం చేపట్టడానికి, ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. బంధుమిత్రులలో చాలామందికి సహాయం చేయడంతో పాటు అండగా నిలబడతారు.

మీన రాశి

ఈ రాశి వారికి గురువు రెండవ స్థానంలో అంటే ధనస్థానంలో ప్రవేశించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు సురక్షితంగా చేతికి అందు తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాటరీ, జూదం, షేర్లు, వడ్డీ వ్యాపారం తదితర ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. సంపదను సమకూర్చు కుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. దాదాపు సంవత్సరకాలం అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలు కొత్త ఆలోచనలతో ఈ సమయాన్ని సద్విని యోగం చేసుకోవడం మంచిది.
ప్రధాన పరిహారాలు
గురు గ్రహం మేష రాశిలో ప్రవేశించినప్పుడు శివాలయానికి వెళ్లి అర్చన చేయించడం వల్ల శీఘ్రంగా సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. తరచూ దత్తాత్రేయ ఆరాధన చేయటం వల్ల కూడా గురువు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇక పుష్యరాగం లేదా కనక పుష్య రాగం అనే రత్నంతో ఉంగరం ధరించడం వల్ల గురువు అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..