Marriage Astrology 2024: అనుకూల స్థితిలో గురు, శుక్ర గ్రహాలు.. కొత్త సంవత్సరంలో వారికి పెళ్లి యోగం పక్కా..!

కొత్త సంవత్సరంలో పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయా? ఎప్పుడు ప్రయత్నాలు ప్రారంభిస్తే మంచిది? ఏ రాశులవారికి పెళ్లయ్యే అవకాశాలున్నాయి? ఈ రాశులవారు ఫిబ్రవరి నెలలో ప్రయత్నాలు ప్రారంభిస్తే తప్పకుండా మే నెల లోపల వివాహ సంబంధాలు నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి శుభ గ్రహాలైన గురు, శుక్రులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల తప్పకుండా వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

Marriage Astrology 2024: అనుకూల స్థితిలో గురు, శుక్ర గ్రహాలు.. కొత్త సంవత్సరంలో వారికి పెళ్లి యోగం పక్కా..!
Marriage Astrology 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 28, 2023 | 5:34 PM

కొత్త సంవత్సరంలో పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయా? ఎప్పుడు ప్రయత్నాలు ప్రారంభిస్తే మంచిది? ఏ రాశులవారికి పెళ్లయ్యే అవకాశాలున్నాయి? ఇటువంటి ప్రశ్నలకు గ్రహాల స్థితిగతులు ఏ విధమైన సమాధానం చెప్పబోతున్నాయో పరిశీలిద్దాం. కొత్త సంవత్సరంలో వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి తప్పకుండా పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ రాశులవారు ఫిబ్రవరి నెలలో ప్రయత్నాలు ప్రారంభిస్తే తప్పకుండా మే నెల లోపల వివాహ సంబంధాలు నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి శుభ గ్రహాలైన గురు, శుక్రులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల తప్పకుండా వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

  1. వృషభం: ఈ రాశివారికి రాశినాథుడైన శుక్రుడితో పాటు శుభాలకు కారకుడైన గురు గ్రహం కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా మారడం జరుగుతోంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా స్థిరత్వం లభించే అవకాశం ఉన్నందువల్ల ఈ రాశివారు ఇప్పటి నుంచి ప్రయత్నాలు సాగించినా ఫలితం ఉంటుంది. సాధారణంగా పశ్చిమ దిక్కు నుంచి వచ్చే సంబంధం ఖాయం అవుతుంది. విదేశీ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. ఫిబ్రవరి నాటికి పెళ్లి జరిగిపోవచ్చు.
  2. కర్కాటకం: ఈ రాశివారికి వివాహ కారకుడైన శుక్రుడు, శుభ కార్యాలకు కారకుడైన గురువు బాగా అను కూలంగా మారబోతున్నందువల్ల, ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు ఆర్థికంగా కలిసి వచ్చే కాలం అయినందువల్ల జనవరిలో పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేయడం మంచిది. తప్పకుండా ఫిబ్రవరి, మే నెలల మధ్య వివాహం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా దక్షిణ, వాయవ్య దిశల నుంచి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నాలు అవసరం ఉండక పోవచ్చు.
  3. కన్య: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గురువు ప్రవేశం వల్ల తప్పకుండా శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి తర్వాత పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తూర్పు లేదా ఈశాన్య దిశల నుంచి సంబంధం రావడం, కుదరడం జరుగుతుంది. ఫిబ్రవరి, మే మధ్య తప్పకుండా వివాహం జరుగు తుంది. దూర ప్రాంతం నుంచి లేదా విదేశాల నుంచి పెళ్లి సంబంధం వచ్చే అవకాశం కూడా ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి ఇప్పటి నుంచే పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. సమయం అనుకూలంగా మారబోతోంది. గురు, శుక్ర గ్రహాల సంచారం కారణంగా తప్పకుండా ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెల దాటకుండానే పెళ్లి సంబంధం కుదిరే సూచనలు న్నాయి. సాధారణంగా ఉత్తరం వైపు నుంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు. బాగా సన్నిహితులతో పెళ్లి ముడిపడి ఉంటుంది. ఇష్టపడ్డ వారితో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం కూడా ఉంది.
  5. మకరం: చాలా కాలంగా పెండింగులో ఉన్న పెళ్లి ప్రయత్నాలు త్వరలో సానుకూలపడడానికి అవకాశం ఉంది. మే నెలలోగా ఈ రాశివారికి తప్పకుండా పెళ్లి అయ్యే సూచనలున్నాయి. పెద్దగా ప్రయత్నం చేయకుండానే బాగా సన్నిహితులతో లేదా బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సాధారణంగా ఉత్తర, పశ్చిమ దిశల నుంచి సంబంధం రావడం జరుగుతుంది. ఇదివరకు ప్రయ త్నం చేసిన సంబంధమే కుదురుతుందని కూడా చెప్పవచ్చు. అనుకోకుండా పెళ్లి ఖాయం అవుతుంది.
  6. మీనం: అనుకోకుండా మంచి సంబంధం కుదురుతుంది. ఇది అతి త్వరలో జరగవచ్చు. గురు, శుక్రుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా ఏప్రిల్ లోపల వివాహం జరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగపరంగా, ఆర్థికంగా స్థిరత్వం లభించడంతో పాటు, వివాహపరంగా కూడా ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. సాధారణంగా దక్షిణ దిశ నుంచి సంబంధం రావడం జరు గుతుంది. బాగా సన్నిహితులు, బంధువుల ద్వారా వచ్చిన సంబంధమే ఖాయం అవుతుంది.