Horoscope Today: వారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (డిసెంబర్ 29, 2023): మేష రాశి వారు ముఖ్యమైన పనులు, వ్యవహారాలను త్వరగా పూర్తి చేస్తారు. వృషభ రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. తప్పకుండా శుభవార్త వింటారు. మిథున రాశి వారి ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (డిసెంబర్ 29, 2023): మేష రాశి వారు ముఖ్యమైన పనులు, వ్యవహారాలను త్వరగా పూర్తి చేస్తారు. వృషభ రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. తప్పకుండా శుభవార్త వింటారు. మిథున రాశి వారి ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను త్వరగా పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. ఆదాయ పరంగా కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. తప్పకుండా శుభవార్త వింటారు. చిన్న నాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల కారణంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అను కూలంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. సతీమణితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. చేపట్టిన పనులు చురుకుగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను ఉత్సాహంగా నెరవేరుస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందు కుంటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచ నలు న్నాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొం టుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్ప డుతుంది. నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో మాటకు, చేతకు విలువ ఉంటుంది. మీ సలహాల వల్ల అధికారులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం పరవా లేదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వ్యాపార, ఉద్యోగాలు చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ప్రయాణాలు మంచి ఫలితాలని స్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కుటుంబసమేతంగా ఇష్ట మైన ఆలయానికి వెడతారు. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పరవా లేదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది లేదా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో బాగా పలుకుబడి పెరుగుతుంది. ఎంతో ఉత్సాహంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. అనుకోకుండా శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)
ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహా రాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. తగి నంత విశ్రాంతి ఉండకపోవచ్చు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖసంతో షాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఆరోగ్యం పరవా లేదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఊహించని ఆదరణ ఎదురవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశా జనకంగా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. సన్నిహితులు ఇబ్బంది పెడ తారు. ఇతరులకు భారీగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా చాలావరకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలు తొలగుతాయి. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువ భారం మోపుతారు. చిన్ననాటి స్నేహి తులతో విందులో పాల్గొంటారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. కీలక వ్యవ హారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు వెడతారు. రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము చేతికి అందుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు చురుకుగా సాగుతాయి. ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు కిటకిటలాడిపోతాయి. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు.
(జ్యోతిష్య ఫలితాలు వారివారి నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదని గమనించగలరు..)
మరిన్ని జ్యోతిష్య కథనాలను చదవండి..