Ganesh Puja Tips: ఇతరులను నిందించి బుధ దోషంతో బాధపడుతున్నారా.. బుధవారం గణపతిని ఇలా పూజించండి..
మీ పనిలో అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా బుధవారం నాడు గణేశుడిని పూజించండి. జాతకంలో బుధుని స్థానం బలహీనంగా ఉన్నా బుధవారం నాడు పూజ చేయడం చాలా మంచి పరిష్కారం. బుధవారం గజాననుని హృదయపూర్వకంగా క్రతువులతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గణపతిని నియమ నిష్టలతో పూజిస్తే గౌరీపుత్ర అనుగ్రహం మీపై కూడా కురుస్తుంది. ఈ రోజు బుధవారం వినాయకుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం..
విఘ్నాలకధిపతి వినాయకుడు ప్రధమ పూజ్యుడు. దేవతల నుంచి సామాన్యుల వరకూ గణేశుడికి మొదటి పూజ చేస్తారు. ఏదైనా శుభ కార్యం లేదా పూజలో ముందుగా గణపతిని పూజించి, తర్వాత ఇతర దేవతలను పూజిస్తారు. గణేశుడిని విజ్ఞానానికి చదువులకు అధిపతిగా భావిస్తారు. మీ పనిలో అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా బుధవారం నాడు గణేశుడిని పూజించండి. జాతకంలో బుధుని స్థానం బలహీనంగా ఉన్నా బుధవారం నాడు పూజ చేయడం చాలా మంచి పరిష్కారం. బుధవారం గజాననుని హృదయపూర్వకంగా క్రతువులతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గణపతిని నియమ నిష్టలతో పూజిస్తే గౌరీపుత్ర అనుగ్రహం మీపై కూడా కురుస్తుంది. ఈ రోజు బుధవారం వినాయకుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం..
గణపతిని ఎలా పూజించాలంటే..
- జాతకంలో బుధ దోషం ఉంటే బుధవారం ఉపవాసం చేయాలనుకుంటే.. ముందుగా బ్రహ్మమహూర్తంలో నిద్రలేచి స్నానం చేయండి. ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి రాగి ప్లేట్ లో గణపతిని ప్రతిష్టించండి. తూర్పు ముఖంగా ఉన్న ఆసనంపై కూర్చొని గణపతిని పూజించడం ప్రారంభించండి. పూజ సమయంలో దేవుడి ముందు ధూపం వేసి, నెయ్యి దీపం వెలిగించాలి. పసుపు, కుంకుమతో పూజించి దర్భలను సమర్పించండి. బూందీ లడ్డూ లేదా కుడుములు నైవేద్యంగా సమర్పించండి. దీని తరువాత గణపతికి భక్తితో హారతిని అందించండి. అలాగే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
- గణపతి సంతోషం కోసం ఏమి చేయాలంటే..
- పూజలో పసుపును చాలా పవిత్రంగా భావిస్తారు. పసుపు లేకుండా ఏ శుభ కార్యమూ పూర్తి కాదు. అందుకే బుధవారం నాడు గణపతి ప్రతి రూపంగా పసుపు వినాయకుడిని తయారు చేసి పూజించండి. ఇలా చేయడం ద్వారా గణపతి కష్టాలను దూరం చేసి సుఖ సంతోషాలను ఇస్తాడు.
- గణపతికి అన్ని పండ్లలో అరటిపండు అంటే చాలా ఇష్టం. అందుకే బుధవారం రోజున వినాయకుడికి అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల గణపతి ఆశీస్సులు లభిస్తాయి.
- గణపతి పూజని తమలపాకులతో చేయండి. తమలపాకును గణేశుడి చిహ్నంగా భావిస్తారు. ఆరాధన సమయంలో గజాననుడికి తమల పాకులు సమర్పించే భక్తుడి ఇంటిని సర్వదా కాచి కాపాడతాడని విశ్వాసం
- ఉండ్రాళ్లు, కుడుములు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి. గణేశుడు తన పూజానంతరం ఉండ్రాళ్లు, కుడుములను సమర్పించడం ద్వారా ప్రసన్నుడవుతాడు. కోరికలన్నీ తీరుస్తాడు.
- గణపతి పూజ సమయంలో దర్భ గడ్డిని సమర్పించండి. దర్భలేని లేని గణపతి పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. బప్పాకు దుర్వా గడ్డి సమర్పించే వారి కష్టాలను బప్ప తొలగిస్తాడు.
- గణపతికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. ఉపవాసం ఉన్నవారు ఆకుపచ్చని బట్టలు ధరించాలి. తినే ఆహారంలో ఆకుపచ్చ వస్తువులను చేర్చాలి.
బుధవారం ఏమి చేయకూడదు
- బుధవారము వాక్కును అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజున ఎవరూ పొరపాటున కూడా తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఈ రోజు ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు బుధ దోషంతో బాధపడతారు.
- బుధవారం నాడు నల్లని దుస్తులు ధరించరాదు. నల్లని దుస్తులు ధరించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
- బుధవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున రుణాలు ఇవ్వడం లేదా రుణాలు తీసుకోవడం ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది.
- బుధవారం ఏ స్త్రీని అవమానించకూడదు. ఈ రోజు స్త్రీలను అవమానిస్తే లక్ష్మిదేవికి కోపం వస్తుంది. ఆర్ధిక కష్టాలు కలుగజేస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు