Lucky Horoscope: సానుకూలంగా మూడు గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి కనీవినీ ఎరుగని అదృష్ట యోగాలు..!

ప్రస్తుతం కుజుడు ఉచ్ఛలో, శనీశ్వరుడు స్వక్షేత్రంలో, శుక్రుడు తన ప్రాణ స్నేహితుడైన శనీశ్వరుడి రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ మూడు గ్రహాలకు సంబంధించిన రాశులకు కనీవినీ ఎరుగని అదృష్ట యోగాలు పట్టే అవకాశం ఉంది. ఈ యోగదాయక కాలం దాదాపు మార్చి చివరి వరకూ కొనసాగుతుంది. కుజ గ్రహం అధిపతి అయిన మేష, వృశ్చిక రాశులు..

Lucky Horoscope: సానుకూలంగా మూడు గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి కనీవినీ ఎరుగని అదృష్ట యోగాలు..!
Lucky Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 20, 2024 | 6:37 PM

ప్రస్తుతం కుజుడు ఉచ్ఛలో, శనీశ్వరుడు స్వక్షేత్రంలో, శుక్రుడు తన ప్రాణ స్నేహితుడైన శనీశ్వరుడి రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ మూడు గ్రహాలకు సంబంధించిన రాశులకు కనీవినీ ఎరుగని అదృష్ట యోగాలు పట్టే అవకాశం ఉంది. ఈ యోగదాయక కాలం దాదాపు మార్చి చివరి వరకూ కొనసాగుతుంది. కుజ గ్రహం అధిపతి అయిన మేష, వృశ్చిక రాశులు, శుక్రుడు అధిపతి అయిన వృషభ, తులా రాశులు, శనీశ్వరుడు అధిపతి అయిన మకర, కుంభ రాశులు తప్పకుండా తమ తమ రంగాల్లో ఉచ్ఛ స్థితికి, ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశి నాథుడైన కుజుడు దశమ స్థానంలో ఉచ్ఛ పట్టడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా ఈ రాశివారు ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడం, అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందడం వంటివి చోటు చేసుకుంటాయి. కెరీర్ పరంగానే కాకుండా సామాజికంగా కూడా ఈ రాశివారి హోదా, స్థాయి పెరుగుతాయి. నిరుద్యోగులు కలలో కూడా ఊహించని ఉద్యోగాల్లో చేరడం జరుగుతుంది. సిరిసంపదలు బాగా కలిసివస్తాయి.
  2. వృషభం: ఈ రాశ్యధిపతి అయిన శుక్రుడు భాగ్య స్థానంలో సంచరిస్తున్నందువల్ల తప్పకుండా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. మనసులోని కోరికల్లో చాలా భాగం నెరవేరుతాయి. విదేశీ సంబం ధమైన ప్రయత్నాలు చేస్తున్నవారికి శుభ వార్తలు అందుతాయి. జీవితంలో ఏమాత్రం ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనూహ్యమైన గుర్తింపు తెచ్చుకుంటారు. పదోన్నతులకు అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాల్లో స్థిరపడతారు.
  3. తుల: ఈ రాశ్యధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నందువల్ల అనేక శుభ యోగాలు కల గడంతో పాటు దిగ్బలం కూడా పట్టింది. ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ తాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. మాతృమూలక ధన లాభం కూడా ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువ ఊహించనంతగా పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  4. వృశ్చికం: ఈ రాశినాథుడైన కుజుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ రాశివారికి అనేక శుభ యోగాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగంలో తప్పకుండా ఉన్నత స్థానా లకు వెళ్లడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. భోగభాగ్యాలు వరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో వేగంగా పురోగతి చోటు చేసుకుంటుంది. సామాజికంగా హోదా, స్థాయి పెరుగుతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  5. మకరం: ఈ రాశినాథుడైన శనీశ్వరుడు ధన స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి మనసులోని కోరికల్లో చాలాభాగం నెరవేరుతాయి. ధనానికి లోటుండదు. ఏదో విధంగా డబ్బు కలిసి వస్తుంటుంది. ఆర్థిక సమస్యలన్నీ ఒక్కొటొక్కటిగా పరిష్కారం అవుతూ ఉంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి ప్రాభవం పెరుగుతుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలను సాధించుకుంటారు.
  6. కుంభం: ఈ రాశిలో ఈ రాశినాథుడైన శనీశ్వరుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి శశ మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. అతి అధ్వాన స్థితిలో ఉన్న వారు సైతం ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేసే స్థితిలో ఉంటారు. కీలకమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం చాలావరకు బాగుపడుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది.