Horoscope Today: వారు ఒకట్రెండు శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..!
దిన ఫలాలు (ఫిబ్రవరి 21, 2024): మేష రాశి వారికి రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (ఫిబ్రవరి 21, 2024): మేష రాశి వారికి రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సా హకర వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులు పురోగతి చెందుతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడి సంచారం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. విద్యార్థులకు పరవాలేదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అవుతాయి. రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పెండింగ్ వ్యవహారాలు, పనులను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బం దేమీ ఉండదు. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా రొటీనుగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో చిన్నా చితకా మార్పులు చోటు చేసు కుంటాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉన్నా, వృథా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఏడవ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల రోజంగా ఉత్సాహంగా గడిచిపోతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమో షన్ రావడం గానీ, ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడం గానీ జరగ వచ్చు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెడతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
సమయం చాలావరకు ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ మీద ఆధారపడతారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులకు చాలా బాగుంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుంభరాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో మంచి పరిచయాలేర్పడతాయి. వ్యాపార సంబంధ సమస్యల్ని అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్య మైన వ్యవహారాలు పూర్తి చేయడంలో ఇబ్బందులుంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1)
ధన స్థానం, తృతీయ స్థానం బలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. ఆస్తి సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారంలో మార్పులు చోటు చేసుకుం టాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అంది వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఏలిన్నాటి శని ఫలితంగా మధ్య మధ్య వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచడం మంచిది. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. ప్రేమ వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. విద్యార్ధులు శ్రద్ధను పెంచుతారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశిలో రాశినాథుడితో పాటు బుధ, రవులు కూడా సంచారం చేస్తున్నందువల్ల ఒకటి రెండు శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఇష్టమైన వ్యక్తులతో కాలక్షేపం చేస్తారు. సర్వత్రా మర్యాద పెరుగు తుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగు తాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు బాగా అనుకూలంగా ఉండడం వల్ల మీ మాటకు, చేతకు తిరుగుండదు. వృత్తి, ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసు కోవడం, కొత్త వ్యూహాలు రూపొందించడం వంటివి జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో, వ్యవ హారాల్లో కొద్దిగా పురోగతి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య సమ స్యలు బాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు.