Money Astrology: అరుదైన గ్రహ యుతి.. ఒకేసారి రెండు మహా యోగాలతో వారికి ధన వృద్ధి..!
Telugu Astrology: గురు చంద్రులు, కుజ చంద్రులు అతి తక్కువ కాలంలో పక్కపక్కన కలుసుకోవడం చాలా అరుదైన విషయం. ఈ గ్రహాల యుతి వల్ల ఏర్పడే గజకేసరి, చంద్ర మంగళ యోగాలు అపారమైన ధన వృద్ధిని కలిగించడంతో పాటు ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ తిరుగులేని విజయాలనిస్తాయి. ఈ యోగాలు పట్టిన కాలంలో ఏదైనా ప్రయత్నం లేదా కార్యక్రమం చేపట్టే పక్షంలో తప్పకుండా అవి ఆ తర్వాతయినా విజయవంతం అవుతాయి.

Money Astrology 2025
సాధారణంగా గురు చంద్రులు, కుజ చంద్రులు అతి తక్కువ కాలంలో పక్కపక్కన కలుసుకోవడం చాలా అరుదైన విషయం. ఈ గ్రహాల యుతి వల్ల ఏర్పడే గజకేసరి, చంద్ర మంగళ యోగాలు అపారమైన ధన వృద్ధిని కలిగించడంతో పాటు ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ తిరుగులేని విజయాలనిస్తాయి. ఈ యోగాలు పట్టిన కాలంలో ఏదైనా ప్రయత్నం లేదా కార్యక్రమం చేపట్టే పక్షంలో తప్పకుండా అవి ఆ తర్వాతయినా విజయవంతం అవుతాయి. మార్చి 6, 7 తేదీల్లో వృషభరాశిలో గురు చంద్రులు, 8, 9 తేదీల్లో మిథున రాశిలో కుజ చంద్రులు కలుస్తున్నందువల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా, అధికారపరంగా ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి మొదటగా గజకేసరి యోగం ఏర్పడడం, ఆ తర్వాత రాశ్యధిపతి కుజుడితో చంద్రుడు కలవడం వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి. ఆదాయాన్ని, సంపదను పెంచుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. భూలాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది.
- వృషభం: ఈ రాశిలో గురువుతో ఉచ్ఛ చంద్రుడు కలవడం, ఆ తర్వాత ధన స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారి ఆదాయ ప్రయత్నాలన్నీ నూరు శాతం సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ది చెందడానికి, రావలసిన డబ్బు చేతికి అందడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరగడంతో పాటు సొంత ఇంటి కల నెరవేరే అవకాశం కూడా ఉంది.
- సింహం: ఈ రాశికి దశమ స్థానంలో గజకేసరి యోగం చోటు చేసుకోవడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభించడం, పదోన్నతులు కలగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది. లాభ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అపార ధన లాభాన్ని కలిగిస్తాయి.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో గురు చంద్రుల కలయిక వల్ల ఒకటికి రెండుసార్లు భాగ్య యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రాదనుకున్న సొమ్ము కూడా చేతికి అందే అవకాశం ఉంది. దశమ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు లభిస్తాయి. భారీగా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై భూలాభం కలుగుతుంది.
- కుంభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో గురు చంద్రులు, అయిదవ స్థానంలో కుజ చంద్రులు కలవడం వల్ల ఈ నాలుగు రోజుల సమయం ఆదాయ వృద్ది ప్రయత్నాలకు బాగా అనుకూలంగా ఉండబోతోంది. కొద్ది ప్రయత్నంతో ధన ధాన్య వృద్ధికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. సంపద బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి లాభం, భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
- మీనం: తృతీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువుతో ఉచ్ఛ చంద్రుడు కలవడం వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల్ని రాజీమార్గంలో పరిష్కరించుకోవడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కూడా పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అత్యధికంగా ధన లాభాలను కలిగిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు, భారీ జీతభత్యాలకు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడానికి అవకాశం ఉంది.



