Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhana Yoga 2025: మిత్ర క్షేత్రాల్లో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి జాక్ పాట్ పక్కా..!

Money Astrology 2025: శని తన స్వస్థానమైన కుంభరాశిలో సంచరిస్తుండగా.. బుధుడు తన మిత్ర క్షేత్రాలైన మకర, కుంభరాశుల్లో, శుక్రుడు తన ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయడం జ్యోతిష్య రీత్యా ప్రాధాన్యత కలిగిన అంశం. కీలక గ్రహాల సంచార ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ మూడు మిత్ర గ్రహాలకు బలం పట్టడం వల్ల తప్పకుండా ధన యోగాలు కలుగుతాయని, అనేక సమస్యల నుంచి బయటపడతారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.

Dhana Yoga 2025: మిత్ర క్షేత్రాల్లో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి జాక్ పాట్ పక్కా..!
Money Astrology 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 07, 2025 | 6:52 PM

శని తన స్వస్థానమైన కుంభరాశిలో, బుధుడు తన మిత్ర క్షేత్రాలైన మకర, కుంభరాశుల్లో, శుక్రుడు తన ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ మూడు మిత్ర గ్రహాలకు బలం పట్టడం వల్ల తప్పకుండా ధన యోగాలు కలుగుతాయని, అనేక సమస్యల నుంచి బయటపడతారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. దాదాపు నెల రోజుల పాటు కొనసాగే ఈ మూడు గ్రహాల అనుకూలత వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులు ఈ గ్రహాల అనుకూలత వల్ల అతి త్వరలో జాక్ పాట్ కొట్టడం లేదా ఆకస్మిక ధన లాభం పొందడం జరుగుతుంది.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛలోకి రావడంతో పాటు, దశమాధిపతి శని దశమ స్థానంలోనే ఉండడం, ధనాధిపతి బుదుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారికి ఈ ఫిబ్రవరి నెలంతా అనేక ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల కుటుం బంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉన్నందు వల్ల ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు.
  2. మిథునం: ఈ రాశి అధిపతి బుధుడు మకర, కుంభ రాశుల్లో సంచారం చేయడం, దశమంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, భాగ్యాధిపతి శని భాగ్య స్థానంలోనే ఉండడం ఏ రంగంలో ఉన్నప్పటికీ విశేష మైన పురోగతి కలుగుతుంది. అనేక పర్యాయాలు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.
  3. కన్య: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానమైన మకరంలోనూ, ఉచ్ఛ శుక్రుడు సప్తమంలోనూ, స్వక్షేత్ర శని ఆరవ స్థానంలోనూ సంచారం చేస్తున్నందువల్ల కొద్ది రోజుల్లో ఈ రాశివారు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రతి ఆదాయ వృద్ధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛ స్థితిలో, షష్టాధిపతి శని షష్ట స్థానంలో, బుధుడు రవితో కలిసి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, సొంత ఇల్లు ఏర్ప రచుకోవడం వంటి వాటికి అవకాశం కలుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందు తుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా మహా భాగ్య యోగాలు కలగడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి.
  5. మకరం: రాశ్యధిపతి శని ధన స్థానంలో బలంగా ఉండడంతో పాటు, ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్ప డడం, తృతీయ స్థానంలో శుక్రుడు ఉచ్ఛ పట్టడం వల్ల ఈ రాశివారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆదాయానికి సంబంధించి ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపారమైన ధన లాభాలు కలుగుతాయి. జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. పిత్రార్జితం కూడా లభిస్తుంది.
  6. కుంభం: రాశినాథుడైన శని స్వస్థానంలో ఉండడం, ధన స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, వ్యయ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచే కాక, వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయి విలువైన ఆస్తి లభిస్తుంది.

అరెస్ట్ వార్తల పై స్పందించిన సుప్రీత..
అరెస్ట్ వార్తల పై స్పందించిన సుప్రీత..
సినిమాలపై నటి హేమ సంచలన నిర్ణయం.. అదే కారణమా?
సినిమాలపై నటి హేమ సంచలన నిర్ణయం.. అదే కారణమా?
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ