AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 18 రాశి ఫలాలు: వీరి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం, వ్యాపారంలో లాభాలు

Horoscope Today (October 18, 2026): ఆదివారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కలగనున్నాయి. మేష రాశి వారికి చేపట్టిన ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు ఉండగా, వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. మిథున రాశి వారు పనులను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఉద్యోగ ప్రయత్నాల్లోనూ సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

అక్టోబర్ 18 రాశి ఫలాలు: వీరి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం, వ్యాపారంలో లాభాలు
Rasi Phalalu 18 Oct 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 18, 2026 | 6:40 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 18, 2026): మేష రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో మీ సరికొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో వృషభ రాశి వారి మాట చెల్లుబాటు అవుతుంది. అన్ని విధాలుగానూ అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిథున రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. బరువు బాధ్యతలు పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో మీ సరికొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కొందరు మిత్రుల ప్రవర్తన వల్ల ఇబ్బందుల్లో పడతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. అన్ని విధాలుగానూ అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలకు లోటు ఉండకపోవచ్చు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది.సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా నిరుత్సాహం కలిగించే అవకాశం ఉంది. సోదరులతో వివాదం సమసిపోతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాల్ని సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాల విష యంలో సానుకూల సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విధంగా రాబడి పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. సహచ రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు సాగిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. చదువుల విషయంలో పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. సంపాదన పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువర్గంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను, ప్రత్యేకతను నిరూపించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో సంతృప్తికరంగా బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అదనపు ఆర్థిక ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్త వుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటి పరిస్థితి ఉంటుంది. ఆస్తిపాస్తుల క్రయ విక్రయాల్లో లాభాలు పొందడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో, సవ్యంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

Also Read: వారఫలాలు: ఆ రాశులకు ఆర్థిక లాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు

Follow Us