Guru Gochar 2026: గురువు అనుగ్రహం.. అదృష్టం పట్టే ఆ 4 రాశులివే..!
Jupiter Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో గురువు గ్రహ మార్పునకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య అంచనాల ప్రకారం 2026 అక్టోబర్ 31న బృహస్పతి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 13న గురువు సింహ రాశిలో వక్రగతిని ప్రారంభిస్తాడు. 2027 జనవరి 25న తిరిగి కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తాడు. అక్టోబర్ 31న జరిగే గురువు సింహ రాశి గోచారం పన్నెండు రాశులపైనా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. అయితే 4 రాశుల వారికి ఈ గోచారంతో అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం..

Guru Gochar In Leo 2026
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవగురువు బృహస్పతి (గురువు) విద్య, ఉద్యోగం, సంపద, అదృష్టం, వివాహం, అభివృద్ధికి సూచికగా భావిస్తారు. గురు గ్రహం రాశి మార్పునకు జ్యోతిష్య పరంగా చాలా ప్రాధాన్యత ఉంటుంది. 2026 అక్టోబర్ 31న గురు గ్రహం కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సింహ రాశికి సూర్యుడు అధిపతి కావడంతో ఈ గోచారం ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, గౌరవ మర్యాదలకు సంబంధించిన అంశాలపై ప్రభావం చూపుతుంది. గురు గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, విద్య వంటి విషయాల్లో అనుకూల అవకాశాలు లభించే అవకాశముంది.
- మేష రాశి: ఈ రాశి వారికి గురు గోచారం ఐదో స్థానంలో జరుగుతుంది. జ్యోతిష్య పరంగా ఈ స్థానాన్ని విద్య, సృజనాత్మకత, సంతానం వంటి అంశాలతో అనుసంధానిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రత చూపే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ ప్రయత్నాలను కొనసాగిస్తే అనుకూల ఫలితాలు సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో పనిచేసేవారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు దక్కుతాయి. కుటుంబ సంబంధాల్లో సానుకూలత కొనసాగేందుకు పరస్పర అవగాహనతో వ్యవహరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి గురువు రెండో స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ స్థానాన్ని సంపద, కుటుంబం, మాటతీరుతో సంబంధం కలిగినదిగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. దీంతో ఆర్థిక వ్యవహారాల్లో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశముంది. ఉద్యోగం, వ్యాపారాల్లో తమ మాటతీరుతో ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. చర్చలు, పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకోవడం మంచిది.
- సింహ రాశి: ఈ రాశిలోకే గురువు ప్రవేశించనుండటంతో ఈ రాశి వారికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. గురువు లగ్న స్థానంలో సంచరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం, వ్యక్తిత్వంలో మెరుగుదల కనిపించడం వంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరగడం లేదా తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే సందర్భాలు రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. కొత్త పనులు ప్రారంభించాలనుకునేవారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం మంచిది.
- తుల రాశి: ఈ రాశి వారికి గురు గోచారం ఆదాయం, లాభాలు, కొత్త పరిచయాలకు సంబంధించిన అంశాల్లో అనుకూలతను తీసుకొచ్చే అవకాశముంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభించడం, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి అనుకూల పరిణామాలు ఎదురవడం వంటి అవకాశాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, భాగస్వామ్యాల ద్వారా ప్రయోజనం పొందుతారు. గతంలో పూర్తికాని పనులు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అయితే ఆశించిన ఫలితాలు సాధించాలంటే క్రమశిక్షణతో పనిచేయడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం అవసరం. (గమనిక: ఈ కథనం జ్యోతిష్య నమ్మకాలు, సంప్రదాయ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. ఇవి శాస్త్రీయంగా నిర్ధారితమైన ఫలితాలు కావు)
Follow Us





