Horoscope Today: ఆ రాశివారు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
మేష రాశికి చెందిన వారికి వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు కూడా వేగం పుంజుకుంటాయి. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మిథురాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి శనివారంనాడు (సెప్టెంబర్ 16) రాశిఫలాలు ఎలా ఉంటాయో.. తెలుసుకోండి..
Daily Horoscope: మేష రాశికి చెందిన వారికి వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు కూడా వేగం పుంజుకుంటాయి. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మిథురాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి శనివారంనాడు (సెప్టెంబర్ 16) రాశిఫలాలు ఎలా ఉంటాయో.. తెలుసుకోండి
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు కూడా వేగం పుంజుకుంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు స్నేహి తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కూడా బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కించడానికి సమయం అనుకూలంగా ఉంది.ఉద్యోగంలో మంచి జీతభత్యాలతో కూడిన స్థిరత్వం లభిస్తుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారప డడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు, వాటి ప్రతిఫలాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి వ్యాపారాల్లో పాత పద్ధతుల స్థానంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ జీవితంలో కూడా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. రాశిలో ఉన్న శుక్ర గ్రహం వల్ల తప్పకుండా ఈ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితంలో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన మంచి సమాచారం అందుకుంటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కూడా శుభపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ పెద్దల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి ఓ కొలిక్కి వస్తుంది. దైవ కార్యాల్లో, సహాయ కార్యక్ర మాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన వర్తమానం అందుతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా అదృష్టం పడుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గుముఖం పడతాయి. కోపతాపాల కారణంగా కుటుంబంలో కొద్దిగా చికాకులు ఏర్పడవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల, జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా మార తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు లాభాల పరంగా బాగా పుంజుకుంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కొత్త ఆదాయ మార్గాలు అంది వస్తాయి. అనవసర పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి. ప్రయాణాలలో వ్యయ ప్రయాసలు మిగులుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అదనపు సంపాదనకు అవకాశాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో గతంలో కంటే లాభాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): అత్యవసర పనులు, వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు.మీ వల్ల సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అనుకోకుండా కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటుచేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాలు వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): అత్యవసర వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొందరు బంధువులు అపనిందలు వేస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి సానుకూల సమాచారం అందుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబపరంగా కూడా బాధ్యతలు పెరుగుతాయి. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దైవ చింతన పెరుగుతుంది. పిల్లల నుంచి మంచి వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.