Chandra Grahan: చంద్రగ్రహణం ఈ 6 రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. పెను మార్పులు .. మీరున్నారేమో చెక్ చేసుకోండి
ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకనే సూతక కాలం చెల్లదు. అయినప్పటికీ గ్రహణ ప్రభావం కొన్నిరాశులపై ఉందనున్నదని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. గ్రహణం ప్రభావితం చేసే 6 రాశుల గురించి తెలుసుకుందాం.

హిందూ మత పరమైన దృక్కోణంలో చంద్ర గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ ఖగోళ సంఘటన వల్ల కలిగే గ్రహాల మార్పులు రాశులను కూడా ప్రభావితం చేస్తాయి. అయితే, ఈ మార్పు కొందరికి ఆహ్లాదకరంగానూ, కొందరికి అశుభకరంగానూ ఉంటుంది. గ్రహణం ఏర్పడే 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుందని విశ్వాసం. ఈ సమయంలో ఏదైనా పని చేయడం శుభప్రదంగా పరిగణించబడదు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకనే సూతక కాలం చెల్లదు. అయినప్పటికీ గ్రహణ ప్రభావం కొన్నిరాశులపై ఉందనున్నదని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. గ్రహణం ప్రభావితం చేసే 6 రాశుల గురించి తెలుసుకుందాం.
మేష రాశి – చంద్ర గ్రహణం కారణంగా మేషరాశి వ్యక్తుల జీవితాల్లో కుటుంబానికి సంబంధించి కొంత ఆందోళన ఏర్పడవచ్చు. ఇంట్లో కొట్లాట వంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది.
వృషభ రాశి – వృషభ రాశి వారిపై కూడా గ్రహణం చెడు ప్రభావం చూపుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.




మిథున రాశి – ఈ రాశి వారికి పెద్దగా సమస్యలు ఎదురుకావు.. అయితే ఈ రాశి పిల్లల విషయంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. పిల్లల వల్ల ఏర్పడే సమస్య సులభంగా పరిష్కరించే ఆలోచన చేయండి.
తుల రాశి – తుల రాశి వారికి కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. పెరిగిన మానసిక ఒత్తిడి కారణంగా మీరు అస్వస్థతకు గురవుతారు. ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగే అవకాశం.. కనుక ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి.
ధనుస్సు రాశి – ధనుస్సు రాశి వారు లాభాలను అందుకుంటారు. గ్రహాల మార్పుల వల్ల ధనుస్సు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు మీ పని ఏదైనా చాలా కాలంగా నిలిచిపోయి ఉంటే, అది కూడా పూర్తవుతుంది.
కుంభ రాశి – ఈ రాశి వారు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రహణం కారణంగా ఆరోగ్యం క్షీణించవచ్చు. విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లయితే, ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశివారికి గ్రహ స్థానాలు అనుకూలంగా లేవు. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).