AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology Tips: పోటీ పరీక్షల్లో విజయం కావాలా? బుధవారం నాడు ఈ చిన్న కిటుకు పాటించి చూడండి!

జీవితంలో ఎంత కష్టపడినా సక్సెస్ కాలేకపోతున్నారా? వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా? చదువుపై పిల్లలు ఏకాగ్రత పెట్టలేకపోతున్నారా? అయితే మీ జాతకంలో బుధ గ్రహ స్థానాన్ని బలపరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధవారం నాడు చేసే కొన్ని చిన్న చిన్న కొనుగోళ్లు మీ తలరాతను మార్చగలవు. విఘ్ననాయకుడి ఆశీస్సులతో పాటు ఆర్థిక పురోగతిని ప్రసాదించే ఆ అద్భుతమైన వస్తువులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Astrology Tips: పోటీ పరీక్షల్లో విజయం కావాలా? బుధవారం నాడు ఈ చిన్న కిటుకు పాటించి చూడండి!
Wednesday Astrology Tips
Bhavani
|

Updated on: May 17, 2026 | 12:40 PM

Share

బుధ గ్రహానికి ఆకుపచ్చ రంగు అంటే ఎంతో ఇష్టం. అందుకే బుధవారం నాడు మార్కెట్‌కు వెళ్లినప్పుడు కొన్ని ఆకుపచ్చని వస్తువులను కొని తెచ్చుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, ఐటీ లేదా వ్యాపార రంగంలో ఉండేవారికి బుధవారం చేసే ఈ పరిహారాలు అద్భుతమైన విజయాలను అందిస్తాయి. మరి సంత నుండి ఈ రోజు ఎలాంటి వస్తువులు తేవాలి, వాటి ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం..

1. ఆకుపచ్చ వస్తువులు లేదా బట్టలు బుధ గ్రహానికి అత్యంత ఇష్టమైన రంగు ఆకుపచ్చ. కాబట్టి, బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు, ఆకుపచ్చని తాజా కూరగాయలు లేదా ఇంటిని అలంకరించే గ్రీన్ కలర్ వస్తువులను కొనడం చాలా శుభప్రదం. దీనివల్ల కుటుంబంలో సుఖశాంతులు పెరిగి, ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది.

2. విద్యా సామగ్రి బుధ గ్రహాన్ని మేధస్సు, తర్కం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. అందుకే ఈ రోజున పుస్తకాలు, పెన్నులు లేదా చదువుకు సంబంధించిన ఇతర వస్తువులను కొనుగోలు చేయడం వల్ల విద్యార్థులలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు బుధవారం పుస్తకాలు కొంటే మంచిదని అంటారు.

3. ఆకుపచ్చ పెసలు బుధవారం నాడు మార్కెట్ నుండి పచ్చ పెసలను కొనుగోలు చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ పెసలను తెచ్చి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించినా లేదా పేదలకు దానంగా ఇచ్చినా.. జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి, బుధ దోష తీవ్రత తగ్గుతుంది.

4. కంచు పాత్రలు లేదా దేవుడి విగ్రహాలు బుధవారం నాడు కంచుతో చేసిన పాత్రలు, పూజా సామాగ్రి లేదా దేవుళ్ల విగ్రహాలను కొని తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది ఇంటికి సంపదను ఆకర్షించడమే కాకుండా, వ్యాపార రంగంలో ఉన్న వారికి నష్టాలు రాకుండా కాపాడుతుంది.

మీ జాతకంలో బుధ గ్రహం అనుకూలంగా లేనప్పుడు లేదా వ్యాపార, విద్యా విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, బుధవారం నాడు పైన పేర్కొన్న వస్తువులను శ్రద్ధతో కొనుగోలు చేసి, విఘ్నేశ్వరుడిని ఆరాధించడం వల్ల ఆశించిన విజయాలు సాధించవచ్చు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం పూర్తిగా జ్యోతిష్య నమ్మకాలు మరియు సాంప్రదాయాలపై ఆధారపడి ఉంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని ఇక్కడ అందించడం జరిగింది

Follow Us