AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం సినిమా రా అయ్యా..! ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.. దెబ్బకు సర్వర్లు మొత్తం క్రాష్

ఓటీటీల్లో సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. థియేటర్స్ లో దుమ్మురేపిన సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీల్లో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా దెబ్బకు ఓటీటీ షేక్ అవుతుంది.

ఏం సినిమా రా అయ్యా..! ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.. దెబ్బకు సర్వర్లు మొత్తం క్రాష్
Ott Movie
Rajeev Rayala
|

Updated on: May 17, 2026 | 12:30 PM

Share

ఓటీటీలో రకరకాల సినిమాలు సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం కొత్త సినిమాలు పెద్దగా థియేటర్స్ లో విడుదల కాలేదు. ఈనెలలో విడుదలైన ఏకైక పెద్ద సినిమా సూర్య నటించిన కరుప్పు. ఈ సినిమాతో హీరో సూర్య ఎట్టకేలకు హిట్ అందుకున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో విడుదలైంది. తెలుగులోనూ ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక వచ్చే నెల్లో రామ్ చరణ్ పెద్ది సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఓటీటీలో సినిమాలు తెగ సందడి చేస్తున్నారు. మొన్నామధ్య థియేటర్స్ లో విడుదలై భారీ హిట్స్ అందుకున్న సినిమాలు ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. వాటిలో ఓ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

ఈ సినిమా దెబ్బకు సర్వర్లు కూడా క్రాష్ అవుతున్నాయి. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా మరేదో కాదు థియేట్సర్స్ లో సంచనల విజయాన్ని అందుకున్న ధురంధర్ 2. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ధురంధర్: ది రివెంజ్ సినిమా కూడా థియేటర్స్ లో భారీ విజయాన్ని అందుకుంది.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. థియేటర్స్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరిస్తుంది. అయితే అది మన దగ్గర కాదు. పాకిస్థాన్ లో మే 14న  ఓటీటీలోకి వచ్చింది ఈ సినిమా.. కాగా ఓటీటీలో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే పాక్ లో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.. నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. అంతే కాదు ఈ సినిమా దెబ్బకు ఓటీటీల్లో ట్రాఫిక్ ఏర్పడి నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్ అయ్యేలా చేసింది. అయితే ధురంధర్ 2 సినిమా ఇండియాలో ఇంకా ఓటీటీలోకి రాలేదు. ‘ధురంధర్: 2’ భారతీయ డిజిటల్ ప్రీమియర్ జూన్ 4న జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మనదగ్గర ఈ సినిమా ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా నటించింది.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా నటించింది.. కట్ చేస్తే
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?