Budh Gochar 2023: కన్యారాశిలోకి బుధ గ్రహం.. బుధ యోగంతో వారికి కనివిని ఎరుగని శుభాలు తథ్యం..!

Mercury Transit to Kanya Rashi: అక్టోబర్ 18 వరకు బుధుడు కన్యా రాశిలోనే కొనసాగడం జరుగుతుంది. ఈ రాశి బుధుడికి స్వక్షేత్రం మాత్రమే కాకుండా, ఉచ్ఛ క్షేత్రం కూడా కావడం వల్ల తప్పకుండా విశేష ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అంతేకాక, అదే రాశిలో సంచరిస్తున్న రవి గ్రహాన్ని కూడా కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడి ప్రతి వారికీ వీలైనంతగా ఏదో ఒక మంచి చేస్తుంది.

Budh Gochar 2023: కన్యారాశిలోకి బుధ గ్రహం.. బుధ యోగంతో వారికి కనివిని ఎరుగని శుభాలు తథ్యం..!
Budh Gochar 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 30, 2023 | 5:03 PM

Mercury Transit: అక్టోబర్ 2 నుంచి కన్యారాశిలో ప్రవేశించబోతున్న బుధ గ్రహం కనివిని ఎరుగని రీతిలో శుభ పరిణామాలను తీసుకురాబోతోంది. అక్టోబర్ 18 వరకు బుధుడు ఈ రాశిలోనే కొనసాగడం జరుగుతుంది. ఈ రాశి బుధుడికి స్వక్షేత్రం మాత్రమే కాకుండా, ఉచ్ఛ క్షేత్రం కూడా కావడం వల్ల తప్పకుండా విశేష ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అంతేకాక, అదే రాశిలో సంచరిస్తున్న రవి గ్రహాన్ని కూడా కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడి ప్రతి వారికీ వీలైనంతగా ఏదో ఒక మంచి చేస్తుంది. తన స్వక్షేత్రంలో ఉచ్ఛ పడుతున్న బుధుడి కారణంగా మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు భద్ర యోగమనే ఒక మహా పురుష యోగం కూడా పట్టడం వల్ల ఈ బుధ సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.

  1. మేషం: ఈ రాశికి ఆరవ స్థానంలో బుధుడు ఉచ్ఛ స్థితికి రావడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్ద ఎత్తున సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. శత్రు పీడ, పోటీదార్ల సమస్య బాగా తగ్గిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థికంగా లాభాలుంటాయి.
  2. వృషభం: ఈ రాశివారికి పంచమ స్థానంలో బుధుడు ఉచ్ఛపట్టడంతో పాటు, బుధాదిత్య యోగం కూడా ఏర్ప డడం వల్ల సంతానికి సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. సంతానం లేనివారికి సంతాన యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు, నిర్ణయాలు, వ్యూహాలకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. సేవ, సహాయ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం, ప్రత్యేక గుర్తింపు పొందడం వంటివి జరుగుతాయి.
  3. మిథునం: ఈ రాశికి నాలుగవ స్థానంలో బుధాదిత్య యోగంతో పాటు, భద్ర యోగమనే మహాపురుష యోగం కూడా ఏర్పడడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా యోగం పట్టడం జరుగుతుంది. కుటుం బంలో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. సమాజంలోని ప్రముఖ వ్యక్తుల్లో ఒకరుగా గుర్తింపు పొందుతారు. సమాజానికి ఉపయోగపడే పనుల్లో భాగం పంచుకుంటారు.
  4. కర్కాటకం: ఈ రాశికి మూడవ స్థానంలో బుధ గ్రహం ఉచ్ఛపట్టడంతో పాటు ఇక్కడ బుధాదిత్య యోగం ఏర్ప డడం వల్ల, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి సాధ్యమవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో చొరవ పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఇతరులకు ఉపయోగకరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. ఆదాయ వృద్ధి ఉంటుంది.
  5. సింహం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో బుధుడి ప్రవేశం వల్ల, రాశి అధిపతి అయిన రవితో కలవడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ఆర్థిక అనుకూలతలు కలుగుతాయి. ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి. కుటుంబ సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
  6. కన్య: ఈ రాశిలోనే బుధాదిత్య యోగంతో పాటు భద్ర మహాపురుష యోగం కూడా ఏర్పడుతున్నందు వల్ల అక్టోబర్ 18 వరకు ఈ రాశివారికి పట్టపగ్గాలుండవు. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం వరిస్తుంది. ఉన్నత స్థాయి ప్రముఖులతో పరిచయాలు పెరగడమే కాకుండా, స్వయంగా ప్రముఖుల జాబితాలో చేరిపోయే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా అధికార యోగం పడుతుంది.
  7. తుల: ఈ రాశికి 12వ స్థానంలో బుధుడు ఉచ్ఛలోకి రావడం వల్ల, ఇక్కడ రవి, బుధులు కలవడం వల్ల ఆ రాశివారికి విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ ప్రతిభా పాటవాలకు గుర్తింపు రావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వైద్య ఖర్చులు తగ్గి, దైవ కార్యాల మీద ఖర్చులు పెరుగుతాయి. శత్రువులు వెనక్కు తగ్గడమే కాక, మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి.
  8. వృశ్చికం: ఈ రాశికి ఆదాయ స్థానంలో లాభ స్థానాధిపతి ఉచ్ఛపట్టడంతో పాటు బుధాదిత్య యోగం ఏర్ప డడం వల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రధాన ఆదాయ వనరులతో పాటు అదనపు ఆదాయ మార్గాల ద్వారా కూడా ఆదాయ వృద్ధి ఉంటుంది. అత్యంత ప్రముఖులతో కూడా పరిచ యాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.
  9. ధనుస్సు: ఈ రాశికి పదవ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. అంతేకాక, భద్ర మహాపురుష యోగం కూడా ఏర్పడుతోంది. దీని ఫలితంగా ఈ రాశివారి జీవితంలో ఈ పదహారు రోజుల కాలంలో అనేక శుభ పరిణామాలు చోటుచేసుకోవడం జరుగుతుంది. కీలక అంశాలకు సంబం ధించి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులు తప్పకుండా మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు.
  10. మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధుడు ఉచ్ఛపట్టడమే కాకుండా, అక్కడ బుధాదిత్య యోగం కూడా ఏర్పడడం వల్ల ఉద్యోగపరంగా, ఆదాయపరంగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి సంక్రమించే సూచనలున్నాయి. తండ్రి సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సతీమణికి కూడా వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వస్తుంది.
  11. కుంభం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో అష్టమాధిపతి ఉచ్ఛ పట్టడంవల్ల ఒక విధమైన విపరీత రాజ యోగం కూడా ఏర్పడింది. దీని వల్ల బంధుమిత్రుల్లోనే కాకుండా సామాజికంగా కూడా పలుకుబడి బాగా పెరుగుతుంది. భార్య వైపు నుంచి ఆస్తి కలసి రావడం గానీ, అంచనాలకు మించి పురోగతి చెందడం గానీ జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యు లేషన్, షేర్లు వంటివి ఆశించిన ఫలితాలనిస్తాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  12. మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధుడు ఉచ్ఛ స్థితిలోకి రావడం, ఇక్కడ బుధ రవులు కలవడం వంటివి శుభ ఫలితాలనిస్తాయి. ఈ స్థానంలో బుధుడు ఉచ్ఛలోకి రావడం వల్ల భద్ర మహాపురుష యోగం కూడా పడుతోంది. ఫలితంగా సామాజికంగా ఉన్నత స్థానంలోకి వెళ్లడం జరుగుతుంది. సతీమణి కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశివారి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.