కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అక్టోబర్ 2వ తేదీ నుంచి పదిహేను రోజుల పాటు ఈ రాశిలో శుక్ర గ్రహం, ధన స్థానంలో కుజ, బుధ, రవులు సంచారం చేయడం వల్ల అనేక మార్గాలలో ఆదాయం గడించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడంతో పాటు, ఆర్థిక సమస్యల నుంచి, రుణాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కుట్రలు, కుతంత్రాల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే సూచనలున్నాయి. ఇష్టమైన వారితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరినీ అంత త్వరగా, అంత తేలికగా నమ్మకపోవడం మంచిది. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది.