గురు గ్రహ ప్రభావం.. ఆ రాశుల వారికి విచిత్రమైన అదృష్టం పట్టనుంది..! అందులో మీరున్నారా..?

ప్రస్తుతం మేష రాశిలో రాహువుతో కలిసి ఉన్న గురు గ్రహం దృష్టి సింహ, ధనుస్సు రాశుల మీద పడుతుంది. దీనివల్ల ఈ రాశుల వారిలో పరివర్తన కలుగుతుంది. పైన చెప్పిన లక్షణాల్లో కొన్నయినా వంటబడతాయి. మేష రాశిలో రాహువుతో మకలిసి ఉన్నందువల్ల పరమ పాప గ్రహమైన రాహువుకు సంబం ధించిన లక్షణాల్లో కూడా మార్పు వస్తుంది.

గురు గ్రహ ప్రభావం.. ఆ రాశుల వారికి విచిత్రమైన అదృష్టం పట్టనుంది..! అందులో మీరున్నారా..?
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 17, 2023 | 11:19 PM

జ్యోతిష శాస్త్రంలో గురువు స్థానం, గురువు దృష్టి అత్యంత ప్రధానమైనవి. ముఖ్యంగా రవి, చంద్ర గ్రహాల మీద కానీ, లగ్నం మీద కానీ గురువు దృష్టి పడినా, వాటితో గురువు కలిసి ఉన్నా అటువంటి వారి జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు, మొండి వ్యాధులకు అవకాశం ఉండదు. పిల్లలు ప్రయోజకులవుతారు. మంచి పేరు ప్రఖ్యాతులుంటాయి. ఇతరులకు సహాయంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ప్రస్తుతం మేష రాశిలో రాహువుతో కలిసి ఉన్న గురు గ్రహం దృష్టి సింహ, ధనుస్సు రాశుల మీద పడుతుంది. దీనివల్ల ఈ రాశుల వారిలో పరివర్తన కలుగుతుంది. పైన చెప్పిన లక్షణాల్లో కొన్నయినా వంటబడతాయి. మేష రాశిలో రాహువుతో మకలిసి ఉన్నందువల్ల పరమ పాప గ్రహమైన రాహువుకు సంబం ధించిన లక్షణాల్లో కూడా మార్పు వస్తుంది. ఈ ఏడాది ఆరు రాశుల మీద గురువు ప్రభావం పడుతోంది. ఇందులో మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులున్నాయి.

  1. మేషం: ఎంతో అహంకారంతో, ఆధిపత్య ధోరణితో, దూకుడుగా వ్యవహరించే మేషరాశి వారిలో ‘సామాజిక స్పృహ ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ రాశిలోనే గురువు సంచారం జరుగుతున్నందువల్ల కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఏవైనా సమస్యలున్నా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. ప్రము ఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
  2. కర్కాటకం: ఈ రాశి గురువు ఉచ్ఛ స్థానం. ఇది చంద్రుడి స్వక్షేత్రం. అందువల్ల మిగిలిన రాశులకన్నా ఎక్కు వగా గురు ప్రభావం ఈ రాశి మీద ఉంటుంది. ఈ రాశివారిలో సహజంగానే ఇతరులకు సహాయం చేయాలన్న ప్రవృత్తి ఉంటుంది. ఈ రాశినాథుడైన చంద్రుడి మీద గురువు దృష్టి పడితే తప్ప కుండా అనారోగ్యాల నుంచి కోలుకోవడం జరుగుతుంది. జీవితం నల్లేరు మీది బండిలా సాగి పోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది.
  3. సింహం: ప్రస్తుతం గురువు దృష్టి సింహరాశి మీద పడింది. ఈ రాశినాథుడైన రవి గ్రహం గురువుకు ప్రాణ స్నేహితుడు. అహంకారానికి, ఆధిపత్య ధోరణికి మారుపేరైన సింహ రాశి మీద గురువు దృష్టి పడి నప్పుడు ఈ లక్షణాలు పూర్తిగా మారిపోతాయి. దైవ కార్యాల్లో, సహాయ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. కలుపుగోలుతనంగా వ్యవహరించడం ప్రారంభం అవుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిస్వార్థంగా వ్యవహరిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
  4. తుల: ప్రతి నిత్యం ధన సంపాదనలో మునిగి ఉండే ఈ రాశివారిలో గురు దృష్టి కారణంగా సమాజ సేవ మీద దృష్టి మళ్లుతుంది. అవసర సమయాల్లో బంధుమిత్రులను ఆదుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల మీద డబ్బు ఖర్చు పెడతారు. ఇతరులను సహాయ కార్యక్రమాలకు ప్రోత్సహిస్తారు. ఇతరుల కోసం త్యాగాలు చేస్తారు. ఒకపక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీద దృష్టి కేంద్రీకరిస్తూనే మరోపక్క సేవా సంస్థల్ని నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
  5. ధనుస్సు: ఈ రాశి గురువుకు చెందిన రాశి అయినందువల్ల ఈ రాశివారిలో సహజంగానే పరోపకార గుణా లుంటాయి. ప్రస్తుతం గురు దృష్టి కూడా పడినందువల్ల వీరిలో ఆధ్యాత్మిక చింతనతో పాటు పరోప కార గుణం కూడా పెరుగుతుంది. విరాళాలు ఇవ్వడం, దానధర్మాలు చేయడం, సహాయ కార్య క్రమాల్లో పాల్గొనడం, దైవ కార్యాలు నిర్వహించడం వంటివి ఎక్కువవుతాయి. స్వార్థ చింతన బాగా తగ్గుతుంది. డాక్టర్లు, లాయర్లు అయి ఉండే పక్షంలో ఉచిత సేవలు అందించడం కూడా జరుగుతుంది.
  6. మీనం: ఈ రాశి కూడా గురువుకు చెందిన రాశి అయినందు వల్ల స్వార్థ చింతన అతి తక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. జీవిత కాలంలో ఎందరికో సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఇతరుల బరువు బాధ్యతలను పంచుకోవడమనేది ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ రాశినాథుడు అనుకూలంగా ఉన్నందువల్ల దైవ కార్యాల్లో పాల్గొనడం, తీర్థయాత్రలు చేయడం వంటివి సర్వ సాధారణమవుతాయి.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!