Horoscope Today: వారి ఆదాయం, ఆరోగ్యానికి లోటు ఉండదు.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు
Daily Horoscope (September 18, 2023): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. 12 రాశుల వారికి సోమవారం (18 సెప్టెంబర్ 2023) రాశిఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకోండి.
Daily Horoscope (September 18, 2023): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. 12 రాశుల వారికి సోమవారం (18 సెప్టెంబర్ 2023) రాశిఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రతి పనీ మీకు అనుకూలంగా ముగు స్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు ముఖ్యమైన స్నేహితుల సహా యంతో వ్యక్తిగత పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగాల్లో మరింతగా పురోగతి సాధించే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయం బాగా పెరుగుతుంది. అనేక మార్గాలలో ఆదాయ వృద్ధి ఉంటుంది. అయితే, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. పిల్లలు మంచి ఫలితాలనిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుభ గ్రహాల సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ పని తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. అధికారుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయితే, పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశా జనకంగా ముందుకు సాగుతాయి. కొత్త వ్యాపారాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా మాట పట్టింపులకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): తోబుట్టువులతో ఉన్న స్థిరాస్తి వివాదాలు తల్లితండ్రుల జోక్యంతో ఒక కొలిక్కి వస్తాయి. కొద్ది ప్రయ త్నంతో ఏ ముఖ్యమైన వ్యవహారమైనా పూర్తి అవుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అంది వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక వ్యక్తిగత సమ స్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుం టారు. వృత్తి, ఉద్యోగాల్లో మరింత రాణిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా కొనసాగుతాయి. పెట్టుబడులకు తగ్గట్టుగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందు తుంది. బంధువర్గం నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఎవరినీ జోక్యం చేసుకోనివ్వవద్దు. ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించిన ఫలితాలను పొందుతారు. కొందరు బంధువులు, స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్ర లేదా విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. చిన్న నాటి స్నేహితులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక సమస్యలన్ని తగ్గించుకోవడమే కాకుండా, ఇతరులకు సహాయం కూడా చేస్తారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన పరిస్థితి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఇతరుల కోసం సమయం ఎక్కువగా కేటాయించి ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి కానీ, ఒత్తిడి బాగా పెరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఇంటా బయటా పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాలు స్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినసప్పటికీ అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.