అయిదు రాశుల వారికి కొత్త స్నేహితుల రాక.. మీ జీవితాన్ని సానుకూల మలుపులు తిప్పే పరిచయాలు కావొచ్చు..

గ్రహచారం ప్రకారం ఐదు రాశుల వారికి ఇప్పటి నుంచి సరికొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. రాజకీయ నాయకులతో ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో, పుర ప్రముఖులతో, ఉన్నత స్థానాలలో ఉన్న వారితో పరిచయాలు ఏర్ప డటం, పెంపొందడం జరుగుతుంది.

అయిదు రాశుల వారికి కొత్త స్నేహితుల రాక.. మీ జీవితాన్ని సానుకూల మలుపులు తిప్పే పరిచయాలు కావొచ్చు..
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 10, 2023 | 5:48 PM

గ్రహచారం ప్రకారం ఐదు రాశుల వారికి ఇప్పటి నుంచి సరికొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. రాజకీయ నాయకులతో ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో, పుర ప్రముఖులతో, ఉన్నత స్థానాలలో ఉన్న వారితో పరిచయాలు ఏర్ప డటం, పెంపొందడం జరుగుతుంది. ఈ పరిచయాల వల్ల సామాజిక స్థాయి లేదా హోదా పెరగటం, పలుకుబడి ఎక్కువ కావడం, ఈ పరిచయాల వల్ల ఉత్తరోత్రా అనేక ప్రయోజనాలు సమకూరటం వంటివి జరుగుతాయి. ఈ ఐదు రాశులు మేషం, మిధునం, సింహం, కన్య, ధనస్సు. ఇదివరకు పరిచయాలు స్నేహాల కంటే ఇవి పూర్తిగా భిన్నమైనవి. ఈ కొత్త పరిచయాల వల్ల జీవితంలో పురోగతి సాధించడం, జీవితం సానుకూల మలుపులు తిరగటం, సమాజంలో మంచి గుర్తింపు రావడం వంటివి చోటు చేసుకుంటాయి. రాశులు మారుతున్న గ్రహాల వల్ల ఈ ఐదు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేష రాశి: ఈ రాశి వారికి లాభ స్థానంలో అంటే కుంభ రాశిలో శనీశ్వరుడు స్వక్షేత్రంలో సంచరిస్తు న్నందు వల్ల రాజకీయంగా వ్యాపార పరంగా బాగా పలుకుబడి జరిగిన వ్యక్తులతో పరిచ యాలు ఏర్పడి, బలపడతాయి. వీటివల్ల వృత్తి, ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకోవటమే కాకుండా ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగు పడుతుంది. కొత్త స్నేహాల కారణంగా జీవితం తప్పకుండా ఒక మంచి మలుపు తిరుగుతుంది. ఈ స్నేహాలు కూడా అప్రయత్నంగా ఏర్పడటం జరుగుతుంది. ముఖ్యంగా సామాజిక సేవ కార్యకలాపాల ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది.
  2. మిథున రాశి: ఈ  రాశి వారికి లాభ స్థానంలో గురు రాహు రవి బుధ గ్రహాల సంచారం వల్ల రకరకాలుగా స్నేహాలు పెంపొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులతో పాటు ఉన్నతాధికారులు, వ్యాపారులు, మేధావులు కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంది. వీరి వల్ల జీవితం అనేక మార్పులకు లోనవుతుంది. అనేక శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, లాభ స్థానంలో రవి గాని, గురువుగాని సంచరిస్తున్నప్పుడు కోటి దోషాలైనా కొట్టుకుపోతాయి. ఈ రాశి వారికి ఈ సూత్రం తప్పకుండా వర్తించి సమస్యల పరిష్కారం జరుగుతుంది.
  3. సింహ రాశి: ఈ రాశి వారికి లాభ స్థానంలో శుక్ర గ్రహ సంచారం జరుగుతున్నందువల్ల సంపన్న లేదా ఉన్నత స్థాయి లేదా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇందులో మహిళలు కూడా ఉండే అవకాశం ఉంది. సామాజిక హోదాలోనూ ఆర్థిక పరిస్థితి లోనూ పలుకుబడిలోను తప్పకుండా సానుకూల మార్పు వస్తుందని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. వృత్తి ఉద్యో గాలలో తమకు అధికారులుగా ఉన్నవారితో కూడా సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏర్పడిన స్నేహ సంబంధాలు క్రమంగా బలపడటానికే అవకాశం ఉంది.
  4. కన్యా రాశి: ఈ రాశి వారికి లాభ స్థానంలో కుజ సంచారం వల్ల ఎక్కువగా రాజకీయ నాయకులతో లేదా ఇతర రంగాలకు చెందిన నాయకులతో పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ నాయకుల సహాయ సహకారాలతో జీవితం ఆర్థికంగా సామాజికంగా సానుకూల మార్పు చెందే అవకాశం ఉంది. ఈ స్నేహాల వల్ల భవిష్యత్తులో కూడా అనేక ప్రయోజనాలు అనుభవానికి వస్తాయి. అయితే, కొన్ని అనవసర అవాంఛనీయ స్నేహాలు ఏర్పడటానికి కూడా అవకాశం ఉంది. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మొత్తం మీద సరికొత్త స్నేహ సంబంధాలు ఎంతగానో ఉపకరించడం జరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనుస్సు రాశి: ఈ రాశి వారికి లాభ స్థానంలో కేతువు సంచరిం చడమే కాకుండా ఆ స్థానాన్ని రాశి నాధుడైన గురు గ్రహం కూడా వీక్షించడం వల్ల సమాజంలో బాగా పలుకుబడి కలిగిన వారితో, పుర ప్రముఖు లతో మేధావులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త స్నేహ సంబంధా లతో జీవితం పట్ల దృక్పథం మారే అవకాశం కూడా ఉంది. జీవితం అనేక విధాలుగా పురోగతి చెందుతుంది. లాభ స్థానంలో సంచరిస్తున్న కేతువు వల్ల చిత్ర విచిత్రమైన వ్యక్తులతో పరిచ యాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఈ స్నేహాలన్నీ అప్రయత్నంగానే జరిగిపోతుంటాయి. ఇవి జీవితంలో తప్పకుండా ఒక కొత్త అధ్యాయానికి తెర తీస్తాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..