Astrology 2024: ఐదు కీలక గ్రహాల అనుకూలత.. ఇక ఆ రాశుల వారికి అన్నీ విజయాలే!
గురు, శని, రాహు, శుక్ర, కుజుల అనుకూల సంచారాల వల్ల ఆరు రాశుల వారికి ఈ ఏడాదంతా విజయాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా ఈ రాశుల వారిని విజయం వరిస్తుంది. అవి మేషం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశులు. వీరి శక్తి సామర్థ్యాల విషయంలో ఎవరికెన్ని సందేహాలు, అనుమానాలున్నప్పటికీ, వీరిలోని పట్టుదల, ఆత్మ విశ్వాసం వీరిని విజయాల వైపు నడిపిస్తాయి.
గురు, శని, రాహు, శుక్ర, కుజుల అనుకూల సంచారాల వల్ల ఆరు రాశుల వారికి ఈ ఏడాదంతా విజయాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా ఈ రాశుల వారిని విజయం వరిస్తుంది. అవి మేషం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశులు. వీరి శక్తి సామర్థ్యాల విషయంలో ఎవరికెన్ని సందేహాలు, అనుమానాలున్నప్పటికీ, వీరిలోని పట్టుదల, ఆత్మ విశ్వాసం వీరిని విజయాల వైపు నడిపిస్తాయి. ఎటువంటి సవాలునైనా అధిగమించడం జరుగుతుంది. ఏడాది గడిచేసరికి వీరు ఎవరూ ఊహించని విజయాలు సాధించే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి కుజుడు అధిపతి అయినందువల్ల వీరు ఎటువంటి ప్రతికూలతలనైనా ఎదుర్కోగలుగు తారు. తమ శక్తి సామర్థ్యాలను ఎవరు శంకించినా, అనుమానించినా వీరిలో బలం మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం కుజుడితో పాటు లాభ స్థానంలో ఉన్న శని, ధన స్థానంలో ఉన్న గురువు వల్ల వీరు తమ ప్రయత్నాలను సాధించుకునే వరకూ విశ్రమించరు. కొత్త పరిస్థితులకు, కొత్త పరి ణామాలకు అనుగుణంగా మారిపోయి, అధికారాన్ని, ఆదాయ వృద్ధిని అనుభవించడం జరుగుతుంది.
- కర్కాటకం: దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడంలో ముందు వరుసలో ఉండే ఈ రాశివారు ఎవరు ఎన్ని విధాలుగా వీరి శక్తి సామర్థ్యాలను శంకించినప్పటికీ, గట్టి పట్టుదలతో, అంతకు మించిన ఆత్మ విశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఈ ఏడాదంతా ఈ రాశివారికి కుజ, గురు, శుక్ర, రవులు బాగా అనుకూలంగా ఉన్నం దువల్ల వీరి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలను సాధిస్తారు. గృహ, వాహనాలతో పాటు, ఆదాయాన్ని పెంచుకుంటారు.
- సింహం: ఈ రాశ్యధిపతి రవి ఈ ఏడాదంతా అనుకూలంగా ఉండడంతో పాటు, శని సప్తమంలో శశ మహా పురుష యోగాన్నివ్వడం, గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో తిరుగులేని విజయాలు సాధించడం జరుగుతుంది. నిరుద్యోగులు గట్టి ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం సంపా దించుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగులు కూడా తమ నైపుణ్యాలను మరింతగా పెంచుకుని విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరత్వం పొందుతారు.
- కన్య: సృజనాత్మకతకు, దీర్ఘకాలిక ప్రణాళికలకు, సానుకూల దృక్పథానికి మారు పేరైన ఈ రాశివారు జీవితంలో అన్ని విధాలుగా పురోగతి చెందడమే ధ్యేయంగా దూసుకుపోతారు. వీరికి ఈ ఏడా దంతా శని, గురువులు అనుకూలంగా ఉండడంతో పాటు, రాశ్యధిపతి బుధుడు కూడా అనుకూ లంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం, ఆర్థికాభివృద్ది చెందడం, వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టడం ఖాయంగా జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశివారు సాధారణంగా ఎంతటి శ్రమకైనా ఓర్చుకుంటారు. ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు. ప్రస్తుతం ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడు, సప్తమంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల విపరీతమైన పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ఇతరుల విమర్శలను, సందేహాలను లెక్క చేయకుండా తదేక దీక్షతో వీరు తమ లక్ష్యాల దిశగా దూసుకు పోతారు. ఆదాయాన్ని పెంచుకోవడం, అధికారాన్ని చేజిక్కించుకోవడం వీరికి తప్పకుండా సాధ్యమవుతాయి.
- మకరం: గట్టి పట్టుదలకు, అవిశ్రాంత శ్రమకు మారుపేరైన ఈ రాశివారు ఈ ఏడాది ఆదాయపరంగానే కాక, సమస్యలను పరిష్కరించుకోవడంలోనూ, ఉన్నత పదవులను అధిరోహించడంలోనూ తప్పకుండా ముందుకు వెళతారు. ఈ రాశి నాథుడైన శనికి వక్రగతి కారణంగా విశేషమైన బలం పట్టడం వల్ల ఈ రాశివారికి ఎటువంటి సవాలునైనా, సమస్యలనైనా ఎదుర్కోగల సామర్థ్యం ఏర్పడుతుంది. దీర్ఘ కాలిక ప్రణాళికలు, వ్యూహాలతో ఆదాయ వనరులను, నైపుణ్యాలను పెంచుకోవడం జరుగుతుంది.