Akshaya Tritiya 2024: వృషభ రాశిలోకి చంద్రుడు.. అక్షయ తృతీయతో ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!

ఈ నెల 10న అంతా అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటారు. అయితే, 9, 10 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశించి ఉచ్ఛ పట్టడం వల్ల, అదే రాశిలో సంచారం చేస్తున్న గురు గ్రహంతో కలిసి గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కారణంగా కూడా కొన్ని రాశులకు ఈసారి అక్షయ తృతీయ శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

Akshaya Tritiya 2024: వృషభ రాశిలోకి చంద్రుడు.. అక్షయ తృతీయతో ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!
Akshaya Tritiya 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 07, 2024 | 12:37 PM

ఈ నెల 10న అంతా అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటారు. అయితే, 9, 10 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశించి ఉచ్ఛ పట్టడం వల్ల, అదే రాశిలో సంచారం చేస్తున్న గురు గ్రహంతో కలిసి గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కారణంగా కూడా కొన్ని రాశులకు ఈసారి అక్షయ తృతీయ శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి అక్షయ తృతీయ నుంచి మరింత యోగ కాలం ప్రారంభం కాబోతోంది. అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మీ వ్రతం, పూజ లేదా లలితా సహస్ర నామం, దుర్గాదేవి స్తోత్రం వంటివి పారాయణం చేయడం వల్ల మరింతగా శుభ ఫలితాలను అనుభవించడానికి అవకాశముంటుంది.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో అక్షయ తృతీయ రోజున చంద్రుడు ఉచ్ఛపట్టడం, పైగా గురువుతో కలిసి గజకేసరి యోగం ఏర్పడడం వల్ల తప్పకుండా ధన యోగాలు, భాగ్య యోగాలు అనుభవానికి వస్తాయి. ఆ రోజున మహాలక్ష్మీ పూజ చేయడం వల్ల, వీలైనంతగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం వల్ల వీరికి అనేక శుభ యోగాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంపాదన పెరగడంతో పాటు, కుటుంబంలో శుభకార్యాలు జరగడం, అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశిలోనే ఉచ్ఛ చంద్రుడు, గురువుతో కలిసి గజకేసరి యోగాన్ని కలిగిస్తున్నందువల్ల ఈ రాశి వారికి అక్షయ తృతీయ నుంచి సంపద బాగా కలిసి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారం అయి, విలువైన ఆస్తి చేజిక్కుతుంది. కుటుంబ స్త్రీలకు ఆ రోజున వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం, కానుకలు సమర్పించడం వల్ల తప్పకుండా వీరు ఐశ్వర్యవంతులయ్యే అవకాశముంది. రోజూ దుర్గాదేవి స్తోత్రం చదువుకోవడం వల్ల సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు ఉచ్ఛ రాశిలో సంచారం చేస్తుండడం, పైగా గురువుతో కలవడం వల్ల ఈ రెండు మూడు రోజుల కాలంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సత్ఫలితాలనిస్తుంది. కుటుంబ స్త్రీలకు వస్త్రాభరణాలు లేదా కానుకలు బహూకరించడం వల్ల ఆర్థిక స్థితిగతులు శీఘ్రంగా మారిపోవడం జరుగుతుంది. ఇది అన్ని విధాలుగానూ కలిసి వచ్చే కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన ఆర్థిక లాభాలుంటాయి.
  4. కన్య: ఈ రాశికి అక్షయ తృతీయ రోజున భాగ్య స్థానంలో చంద్ర, గురువులు కలవడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఒకటికి రెండు సార్లు ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దినదినాభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడానికి, అదనపు ఆదాయానికి కూడా అవకాశముంది. విదేశీ సొమ్ము అనుభవించే అవకాశం అంది వస్తుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. వారసత్వపు ఆస్తి సంక్రమించే అవకాశముంది.
  5. వృశ్చికం: ఈ రాశివారికి అక్షయ తృతీయ రోజున సప్తమ స్థానంలో చంద్రుడు ఉచ్ఛపట్టడం, పైగా ధన కారకుడైన గురువుతో యుతి చెందడం వల్ల రావలసిన సొమ్ము చేతికి అందడం, బాకీలన్నీ వసూలు కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఒకటి రెండు ధన యోగాలు పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. సంపన్య వ్యక్తితో వివాహం నిశ్చయం అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లో పెరుగుదల ఉంటుంది.
  6. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, చంద్రుల కలయిక జరుగుతున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది. ఇంట్లోని స్త్రీలకు వస్త్రాభరణాలు కొనివ్వడం వల్ల తప్పకుండా భాగ్య యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా ఊపందుకుంటాయి. ఉద్యోగ జీవితం ఆదాయపరంగా కొత్త పుంతలు తొక్కుతుంది.