Maharaja Yoga: ఆ రాశుల వారికి మహారాజ యోగం.. మీ మాటకు ఎదురుండదు అంతే..!
ఏ రాశికైనా ఆరు, ఏడు, ఎనిమిది రాశుల్లో గ్రహాలున్న పక్షంలో దాన్ని అధియోగంగా పరిగణిస్తారు. అధి యోగమంటే అధికార యోగం లేదా మహారాజ యోగం. ప్రస్తుతం అయిదు రాశులకు ఈ యోగం పట్టింది. ఈ యోగం ఏదో ఒక రూపంలో ఈ రాశులవారికి పట్టడం జరుగుతుంది.
ఏ రాశికైనా ఆరు, ఏడు, ఎనిమిది రాశుల్లో గ్రహాలున్న పక్షంలో దాన్ని అధియోగంగా పరిగణిస్తారు. అధి యోగమంటే అధికార యోగం లేదా మహారాజ యోగం. ప్రస్తుతం అయిదు రాశులకు ఈ యోగం పట్టింది. ఈ యోగం ఏదో ఒక రూపంలో ఈ రాశులవారికి పట్టడం జరుగుతుంది. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి ఈ మహారాజ యోగం వల్ల రాజపూజ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. మొత్తం మీద మూడు వారాల పాటు వీరి మాటకు ఎదురుండదు.
- కర్కాటకం: ఈ రాశివారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో శని సంచారం వల్ల అధియోగం ఏర్పడింది. దీనివల్ల ఉద్యోగంలో చాలా కాలంగా ఆగిపోయి ఉన్న పదోన్నతి లభించే అవకాశముంది. పదోన్నతి కార ణంగా ఆదాయం పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, ఇవి నిల దొక్కుకోవడం జరుగుతుంది. అధికారులకు సన్నిహితం కావడమో, అధికార బాధ్యతలను పంచు కోవడమో జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది.
- సింహం: ఈ రాశికి సప్తమంలో శనీశ్వరుడు, అష్టమ స్థానంలో బుధ, కుజులు సంచారం చేస్తున్నందువల్ల అధి యోగం ఏర్పడింది. సహజ నాయకత్వ లక్షణాలు కలిగిన ఈ రాశివారికి తప్పకుండా రాజ యోగం, అధికార యోగం, దన యోగం పట్టే సూచనలున్నాయి. అష్టమంలో ఉన్న శుక్రుడి కార ణంగా సంపాదన, డిమాండ్ పెరిగి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిం చడంతో పాటు నేరుగా అధికార యోగం పట్టే అవకాశముంది. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి.
- కన్య: ఈ రాశివారికి 6,7,8 స్థానాల్లో వరుసగా శని, శుక్ర, కుజ, బుధులు, గురు, రవులు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగంతో పాటు రాజకీయ ప్రాబల్యం కూడా కలుగు తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. బంధుమిత్రుల్లో ఒక మెట్టు పైన ఉంటారు. అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు సంభవిస్తాయి.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో శుక్ర, కుజ, బుధులు, ఏడవ స్థానంలో గురు, రవులు సంచారం చేస్తు న్నందువల్ల విశేషమైన మహా రాజ యోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా వీరు వృత్తి, ఉద్యోగా ల్లోనే కాక, వ్యాపారాల్లోనూ అతి వేగంగా పురోభివృద్ధి చెందడం, ఆదాయం పెంచుకోవడం జరుగు తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఆకస్మిక ధన యోగం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి ఆరవ స్థానంలో గురు, రవుల సంచారం వల్ల మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ధన వృద్ధి యోగం పడుతుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఫలి తంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, లాభాల బాటపడతాయి. బంధుమిత్రుల్లో ప్రాధా న్యం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మాట చెల్లుబాటవు తుంది.