Municipal polls: వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్.. వలసలు నిరంతరం కొనసాగుతాయ్.. ఎంపీ విజయసాయిరెడ్డి

MP V. Vijayasai Reddy: విశాఖపట్నం మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అధికారపార్టీ వైఎస్ఆర్‌సీపీ వలసలకు తెరలేపింది. అయితే వైసీపీలోకి ఈ వలసలు ఇంతటితోనే ఆగవని.. నిరంతరం కొనసాగుతూనే..

Municipal polls: వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్.. వలసలు నిరంతరం కొనసాగుతాయ్.. ఎంపీ విజయసాయిరెడ్డి
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 23, 2021 | 2:15 PM

MP V. Vijayasai Reddy: విశాఖపట్నం మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అధికారపార్టీ వైఎస్ఆర్‌సీపీ వలసలకు తెరలేపింది. అయితే వైసీపీలోకి ఈ వలసలు ఇంతటితోనే ఆగవని.. నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని ఆపార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టంచేశారు. త్వరలోనే ఏపీ నుంచి టీడీపీ ఖాళీ అవుతుందంటూ ఆయన పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి విశాఖ పర్యటనలో భాగంగా.. ఆయన సమక్షంలో ఉత్తర నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నాయకులు మంగళవారం వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి.. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాక్సర్ రాజు, తదితరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైసీపీలోకి వలసలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని.. త్వరలో చాలామంది పార్టీలోకి చేరుతారంటూ పేర్కొన్నారు. ఉత్తర నియోజకవర్గంలో 14, 24, 25, 26 వార్డుల నుండి టీడీపీ కీలక నేతలు వైసీపీలో చేరారని తెలిపారు. 14 వార్డు టీడీపీ అభ్యర్థి నరసింహారాజు వైసీపీలో చేరడం చాలా సంతోషకరమంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మోహన్‌రెడ్డి సమర్థ పాలనకు టీడీపీ నేతలు.. వైసీపీ వైపు చూస్తున్నారంటూ తెలిపారు. అతి త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందని.. భవిష్యత్తులో చాలా ఏకగ్రీవాలు జరుగుతాయంటూ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాగా.. కార్పోరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికారపార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Also Read:

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!