MP Vijayasai reddy: ఏపీ విధానాలు స్టడీ చేయమని కేరళ ప్రభుత్వం వ్యవసాయ మంత్రిని పంపింది: ఎంపీ విజయసాయిరెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిని పథకాలపై ఇప్పుడు యావత్ భారతదేశం దృష్టి పడిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

MP Vijayasai reddy: ఏపీ విధానాలు స్టడీ చేయమని కేరళ ప్రభుత్వం వ్యవసాయ మంత్రిని పంపింది: ఎంపీ విజయసాయిరెడ్డి
Vijayasai Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 18, 2021 | 1:44 PM

YSRCP MP Vijayasai reddy – Kerala: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిని పథకాలపై ఇప్పుడు యావత్ భారతదేశం దృష్టి పడిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రైతు భరోసా పథకం అద్భుతమని కేరళ ప్రభుత్వం ప్రశంసించింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా అయిన విజ‌య‌సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఏపీ విధానాలు స్టడీ చేయమని వ్యవసాయ మంత్రిని పంపిందని ఆయన చెప్పారు.

కేరళ బృందాలు ఇప్పటికే గ్రామాల్లో ఆర్‌బీకే పనితీరును అన్ని రాష్ట్రాలూ స్టడీ చేస్తున్నాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సాగుపై అధ్యయనానికి ఒకప్పుడు మన అధికారులు వేరే రాష్ట్రాలు వెళ్లేవారు. ఇప్పుడు వారే మన దగ్గరకు వస్తున్నార‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు. స‌కాలంలో విత్త‌నాలు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతుండటంపై ప్రసంశలు వస్తున్నాయని ఆయన చెప్పారు.

దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన విత్తన విధానాన్ని (సీడ్‌ పాలసీ) తీసుకొచ్చిందన్న విషయాన్ని వైసీపీ ఎంపీ గుర్తు చేశారు. భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా జన్యుపరంగా అభివృద్ధి చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని సకాలంలో రైతులకు అందజేయడమే ఈ విధానం లక్ష్యమ‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో పైసా ఖర్చులేకుండా నాణ్యమైన విద్య. క్యూబా మాదిరిగా వైద్యరంగంలో విప్లవం. ఫామిలీ డాక్టరు కాన్సెప్ట్. రైతులకు సర్వం సమకూర్చుతూ UNO దృష్టిని ఆకర్షించిన ఆర్బీకేలు. సగానికి పైగా పదవులతో మహిళా సాధికారత. పేదలకు 31లక్షల ఇళ్లు. ఓర్వలేని విపక్షాలు అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ లో వెల్లడించారు.

Read also: Sasikala: జయలలిత ఫార్ములా చిన్నమ్మకు వర్కౌట్ అవుతుందా..? ఏఐఏడీఎంకే లో ఎంట్రీకి చిన్నమ్మ యాక్షన్ ప్లాన్ అదేనా?