AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష..

న్యాయమేవ జయతే..! ఎట్టకేలకు న్యాయం లభించింది..ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల జైలుశిక్ష, లక్షన్నర జరిమానా విధించింది.దళితులకు శిరోముండనం కేసులో..

శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష..
Mlc
Ravi Kiran
|

Updated on: Apr 16, 2024 | 2:07 PM

Share

న్యాయమేవ జయతే..! ఎట్టకేలకు న్యాయం లభించింది..ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో విశాఖఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల జైలుశిక్ష, లక్షన్నర జరిమానా విధించింది.దళితులకు శిరోముండనం కేసులో 28 ఏళ్లకుపైగా విచారణ సాగిన తర్వాత విశాఖ కోర్టు నేరం చేసినట్లుగా నిర్ధారించి తీర్పు ఇచ్చింది.ఈ కేసులో తోట త్రిమూర్తులుతో పాటు 9 మంది నిందితులుగా ఉన్నారు.

1994లో రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక దళితులపై దాడులకు పాల్పడ్డారు. రాజకీయంగా తమకు ఎదురొస్తున్నారనే అక్కసుతో ఐదుగురు దళితుల్ని హింసించి కనుబొమ్మలు తొలగించి, శిరోముండనానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన సమయంలో టీడీపీ TDP అధికారంలో ఉంది. ప్రస్తుతం మండపేట వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో తోట త్రిమూర్తులు ఉన్నారు.ఘటన జరిగిన 28ఏళ్ల తర్వాత వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పును వెలువరించింది. శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాత్రను ప్రాసిక్యూషన్ నిరూపించింది. నిందితుల్లో ఒకరు మరణించగా 9మందికి శిక్షలు ఖరారు చేశారు.

1997 జనవరి 1న కేసు నమోదైంది. 1994లో తోట త్రిమూర్తులు రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి టీడీపీ చారు. స్థానికంగా తనకు వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతో దాడి చేసి హింసించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. ఈఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు..వారిలో 11 మంది మృతి చెందారు..ఈ కేసు విచారణలో రకరకాల మలుపులు తిరిగింది.1998లో ఈ కేసును కొట్టి వేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.. అయితే మళ్లీ హైకోర్టు ఆదేశాలతో 2000లో కేసు రీ ఓపెన్‌ చేశారు..2012 నుంచి 2019 వరకు 146 సార్లు ఈ కేసు వాయిదా పడింది..28 ఏళ్లుగా సాగిన విచారణ తర్వాత ఇవాళ ఈ కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల జైలుశిక్ష, లక్షన్నర జరిమానా విధించింది.. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో శిరోముండనం కేసు తీర్పు హాట్‌ టాపిక్‌గా మారింది.. అయితే 28 ఏళ్ల తర్వాత తీర్పు రావడంతో తమకు న్యాయం జరిగిందంటూ బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.