Sajjala Ramakrishna Reddy: ఘోరంగా ఓడిపోతే.. పరువు పోతుందని సేఫ్ గేమ్ ఆడారు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy on TDP, JanaSena: బద్వేల్ ఫలితం తమ బాధ్యతను మరింత పెంచిందని.. ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నామని ఈ గెలుపుతో మరోసారి స్పష్టమైందంటూ
Sajjala Ramakrishna Reddy on TDP, JanaSena: బద్వేల్ ఫలితం తమ బాధ్యతను మరింత పెంచిందని.. ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నామని ఈ గెలుపుతో మరోసారి స్పష్టమైందంటూ ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొ్న్నారు. టీడీపీ నేతలు బీజేపీకి ఏజెంట్లుగా పనిచేశారని అయినప్పటికీ ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన.. బరిలో లేకపోయినా బీజేపీ అభ్యర్థిని మోసుకొచ్చారని ఆరోపించారు. బద్వేల్‌లో బీజేపీ గెలుపు అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. చరిత్రాత్మక విజయం ఇచ్చిన బద్వేల్ ప్రజలకు కృతజ్ఞతలని తెలిపారు. తమ పార్టీకి 76. 24 శాతం ఓట్లు మాకు వచ్చాయని.. బద్వేల్ ఫలితం మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. సాంకేతికంగా టీడీపీ పోటీలో లేకపోయినా బీజేపీ అభ్యర్థిని భుజాన వేసుకుందన్నారు. చాలా వరకూ పోలింగ్ స్టేషన్ల లో టీడీపీ వాళ్లే ఏజెంట్లుగా ఉన్నారని.. బీజేపీ పంచిన ప్రతీ కరపత్రంలోనూ పవన్ కల్యాణ్ ఫోటో ఉందంటూ సజ్జల తెలిపారు.
ఓటమి ముందే గ్రహించి టీడీపీ, జనసేనలు అభ్యర్థుల్ని పెట్టలేదన్నారు. ఘోరంగా ఓడిపోతే పరువుపోతుందని ఆ రెండు పార్టీలు సేఫ్ గేమ్ ఆడుతున్నాయన్నారు. రెండున్నారేళ్లుగా సీఎం జగన్ చేసిన సంక్షేమ పాలనని ప్రజలకు ఎన్నికల్లో వివరించామన్నారు. సీఎం జగన్ పై చంద్రబాబు అండ్ కో చేస్తున్న అసత్యా ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. తప్పుడు ప్రచారమే తప్ప ప్రజల్లోకి వచ్చి బలం చూపించుకునే దమ్ము వీరికి లేదంటూ సజ్జల విమర్శించారు. మిగిలిన మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రాబోతున్నాయంటూ సజ్జల వ్యాఖ్యానించారు. కుప్పంలో జరిగిన చంద్రబాబు పర్యటన కామెడీ షో లాంటిదని విమర్శించారు. బద్వేల్ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో అందరూ చూశారని.. సోము వీర్రాజు అన్నట్టు అరాచకాలు, దొంగ ఓట్లు జరిగితే బయటకి వచ్చేవి కదా..? అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి ప్రలోభాలు జరగలేదని సోము వీర్రాజుకి కూడా తెలుసంటూ సుజ్జల పేర్కొన్నారు. అందుకే బీజేపీకి 24 వేల ఓట్లు వచ్చాయని.. గత ఎన్నికల్లో 700 మాత్రమే వచ్చాయంటూ వివరించారు.
అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో జరిగే పాదయాత్ర సంగీభావం తెలిపిన నాయకులు మూడు ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకమా..? అంటూ సజ్జల ప్రశ్నించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇలాంటి పాదయాత్రలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. తిరుపతికి వెళ్లే దారిలో ఎవరైనా రాయలసీమ వారు అడ్డుకుంటే గొడవలు జరగవా..? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు..? అంటూ ప్రశ్నించారు. దేవస్థానం కంటే.. పక్కనే అమ్మవారి గుడి ఉంది అక్కడికి వెళ్లొచ్చు కదా.. అని సూచించారు. అమరావతి అనేది పెద్ద రియర్ ఏస్టేట్ వ్యాపారమని.. అక్కడి నిజమైన రైతుల్ని మోసం చేశారంటూ టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
Also Read: