Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Elections: ఏపీలో మళ్లీ అధికారం మాదే.. మంత్రి అంబటి రాంబాబు లెక్క ఇదే..

ఏపీలో పోలింగ్‌ జరిగిన తీరు ఆశ్చర్యపర్చిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఉదయం 7 గంటలకే మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చారన్నారు. ఈ పోలింగ్‌ వైసీపీ విజయానికి సంకేతం అని చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ చర్యలపై మండిపడ్డారు.

AP Elections: ఏపీలో మళ్లీ అధికారం మాదే.. మంత్రి అంబటి రాంబాబు లెక్క ఇదే..
Ambati Rambabu
Follow us
Srikar T

|

Updated on: May 14, 2024 | 1:46 PM

ఏపీలో పోలింగ్‌ జరిగిన తీరు ఆశ్చర్యపర్చిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఉదయం 7 గంటలకే మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చారన్నారు. ఈ పోలింగ్‌ వైసీపీ విజయానికి సంకేతం అని చెప్పారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ చర్యలపై మండిపడ్డారు. సీఎం జగన్ ను గెలిపించడానికి మహిళలు, వృద్దులు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల వద్ద నిల్చొని ఓటు వేశారన్నారు. ప్రచారం నుంచి కూడా మహిళలే ముందున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పురుషులకంటే మహిళలు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారన్నారు. దీనిని పాజిటివ్ ఓటింగ్ గా భావించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్ జగన్ ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.

మహిళలకు కల్పించిన సాధికారతకు ప్రతి రూపమే పోలింగ్ శాతం పెరిగేందుకు నిదర్శనమన్నారు. ఆమ్మ ఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, చేయూత లాంటివి మహిళలకే అందించారని గుర్తు చేశారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం కృషిచేశారని సీఎం జగన్ ను కొనియాడారు. ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదైన సంఘటన అన్నారు. సాధారణంగా ఐదేళ్లు పరిపాలన తరువాత ఇది జరగలేదు, అది జరగలేదు అనే వ్యతిరేకత ఉంటుంది.. కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకతే లేదని స్పష్టం చేశారు. కేవలం సత్తెనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

త్వరలోనే వరుణ్ తేజ్ నయా మూవీ స్టార్ట్..
త్వరలోనే వరుణ్ తేజ్ నయా మూవీ స్టార్ట్..
పవన్ కూతురు ఆద్య చేసిన మంచి పనికి చప్పట్లు కొట్టాల్సిందే.. వీడియో
పవన్ కూతురు ఆద్య చేసిన మంచి పనికి చప్పట్లు కొట్టాల్సిందే.. వీడియో
జాతరలో అశ్లీల నృత్యాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితార్..!
జాతరలో అశ్లీల నృత్యాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితార్..!
APPSC జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షల షెడ్యూల్ 2025 వచ్చేసిందోచ్..
APPSC జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షల షెడ్యూల్ 2025 వచ్చేసిందోచ్..
'నల్ల ట్యాక్సీ' అంటూ.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు!
'నల్ల ట్యాక్సీ' అంటూ.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు!
రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్
రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్
మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..
మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..
నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు