YS Jagan: మేమంతా సిద్ధం.. 10వ రోజుకు సీఎం జగన్ బస్సు యాత్ర.. ప్రసంగంపై ఉత్కంఠ..
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో .. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో దూసుకెళ్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆదివారంతో పదో రోజుకు చేరుకుంది. ఇవాళ సీఎం జగన్ యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు జువ్విగుంట క్రాస్ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో .. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో దూసుకెళ్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆదివారంతో పదో రోజుకు చేరుకుంది. ఇవాళ సీఎం జగన్ యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు జువ్విగుంట క్రాస్ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు. పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల చేరుకుంటారు. ఆ తరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి చేరుకుంటారు.
పదో రోజు యాత్ర ఇలా..
- ప్రకాశం జిల్లాలో కొనసాగనున్న జగన్ బస్సుయాత్ర
- ఉ.9 గంటలకు జువ్విగుంట క్రాస్ నుంచి యాత్ర ప్రారంభం
- పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్లకు జగన్
- సాయంత్రం కొనకనమెట్ల క్రాస్ దగ్గర బహిరంగ సభ
- అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల, పొదిలి..
- రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి జగన్
- వెంకటాచలంపల్లిలో రాత్రి బస చేయనున్న సీఎం జగన్
కాగా.. వైసీపీ బస్సుయాత్ర తొమ్మిదోరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సాగింది. శనివారం ఉదయం 9 గంటలకు చింతారెడ్డిపాలెం నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర కోవూరు క్రాస్, గౌరవరం మీదుగా సాగింది. లంచ్ బ్రేక్ తర్వాత కావలిలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బహిరంగ సభ జరిగింది. లక్షలాదిగా హాజరైన జనానికి ర్యాంప్ మీద నడుస్తూ అభివాదం చేశారు జగన్. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని, మోస పూరిత కూటమితో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమా విలన్ క్యారెక్టర్లన్నీ కలిపితే చంద్రబాబు అవుతారంటూ విపక్ష నేతపై విరుచుకుపడ్డారు జగన్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..