YS Sharmila: వేంపల్లె రిజిస్ట్రార్ కార్యాలయంలో వైఎస్ షర్మిల.. అసలు కారణం ఏంటంటే?
ఇడుపులపాయలో తనపేరుపై ఉన్న కొన్ని ఆస్తులను తన కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలీల పేరుపై వైయస్ షర్మిల రిజిస్ట్రేషన్ చేయించారు. షర్మిల తనపై ఉన్న ఆస్తులను కొడుకు, కూతురు పేరు మీదకు మార్చడం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.
ఇడుపులపాయలో తనపేరుపై ఉన్న కొన్ని ఆస్తులను తన కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలీల పేరుపై వైయస్ షర్మిల రిజిస్ట్రేషన్ చేయించారు. షర్మిల తనపై ఉన్న ఆస్తులను కొడుకు, కూతురు పేరు మీదకు మార్చడం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన తర్వాత వైయస్సార్ వర్ధంతి, జయంతులకే పులివెందులకు పరిమితమైన షర్మిల.. రేపు వైయస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయ చేరుకున్నారు. అందరూ ఇడుపులపాయకు షర్మిల వెళుతుంది అనుకున్న క్రమంలో.. ఒక్కసారిగా షర్మిల ఇడుపులపాయలోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ తనపై ఉన్న ఆస్తులను కొన్నింటిని తన కొడుకు, కూతురు పేర్లకు బదలాయించడం చక చకా జరిగిపోయాయి.
హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో విజయమ్మతో పాటు తన కొడుకు, కూతురుతో కడప చేరుకున్న వైఎస్ షర్మిల.. ముందుగానే సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందికి ఆస్తుల బదలాయింపు ముందుగానే తెలిపినట్లు సమాచారం. అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి షర్మిల కొడుకు, కూతురు మాత్రమే వచ్చారు. విజయమ్మ నేరుగా ఇడుపులపాయ ఎస్టేట్ కు వెళ్లిపోయారు. షర్మిల సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు రావడంకో స్దానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
అందరినీ ఆప్యాయంగా పలుకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు షర్మిల. అనంతరం ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాటు వద్ద దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద వైయస్ఆర్ జయంతి సందర్బంగా షర్మిల, విజయమ్మ నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడినుంచి షర్మిల బయలుదేరి హైదరాబాద్ వెళ్ళనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..