Viral Video: అర్ధరాత్రి అడవిలో తండ్రి శవం పక్కనే చిన్నారి.. అలా ఏడుస్తూనే..
నిజామాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారి రాత్రంతా అడవిలో తండ్రి శవం పక్కన ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకున్నాడు. అవును తండ్రితో కలిసి ఎంతో సంతోషంగా బంధువుల ఇంటికి వెళ్లిన ఆ చిన్నారి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయి కారడవిలో ఒంటరిగా మిగిలాడు.
నిజామాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారి రాత్రంతా అడవిలో తండ్రి శవం పక్కన ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకున్నాడు. అవును తండ్రితో కలిసి ఎంతో సంతోషంగా బంధువుల ఇంటికి వెళ్లిన ఆ చిన్నారి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయి కారడవిలో ఒంటరిగా మిగిలాడు. నాన్నకు ఏం జరిగిందో , తనవాళ్ళెవరూ కానరాక నాన్నకోసం ఏడుస్తూ అక్కడే నిద్రపోయాడు అభం శుభం తెలియని ఆ మూడేళ్ల చిన్నారి. అసలేం జరిగిందంటే..
జిల్లాలోని ఇందల్‌వాయి మండలం వెంగల్‌పాడ్‌కుక చెందిన మాలవత్ రెడ్డి తన మూడేళ్ల కుమారుడిని వెంటపెట్టుకుని కామారెడ్డి జిల్లా యాచారంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా సదాశివనగర్ మండలం దగ్గి అటవీప్రాంతంలో 44వ నంబరు జాతీయ రహదారి పక్కన బారికేడ్‌ను ఢీకొట్టింది. దీంతో తండ్రీకుమారులిద్దరూ రోడ్డు పక్కన పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలియని బాలుడు తండ్రిని లేపేందుకు ప్రయత్నించి రోదిస్తూ అక్కడే నిద్రపోయాడు. మర్నాడు ఉదయం సమీపంలోని ఆలయానికి వచ్చిన పూజారి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తానని ఎమ్మెల్యే గోవర్ధన్ హామీ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...