YouTuber Kavita: కొల్హాపూర్‌లో బర్రెలక్క.. ధర్మవరంలో జుమ్ చక స్టార్.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న యూట్యూబర్లు..
యూట్యూబ్‌లో తమ వీడియోలతో అభిమానులను సంపాదించుకోవడం, కాస్త పేరు, ప్రఖ్యాతలు రాగానే సెలబ్రిటీలు అయిపోవడం చూస్తున్నాం. ఒక్క వీడియోతో బర్రెలక్క ఎంత ఫేమస్ అయ్యారో మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ కొల్హాపూర్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క శిరీషను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు యూట్యూబర్లు.

ఏపీలో కూడా ఒక యూట్యూబ్ స్టార్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా అంటున్నారు. బర్రెలక్క (శిరీష)లానే.. నిరుద్యోగ యువత తరపున తాను పోరాటం చేస్తానని ముందుకొస్తున్నారు ఈ యువతి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన దాసరి కవిత అలియాస్ జుమ్ చక జుమ్ చక స్టార్ ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు.
ముఖ్యంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడిస్తానని జుమ్ చక జుమ్ చక్ స్టార్ కవిత సవాల్ చేస్తున్నారు. కవిత పది హామీలతో ఏకంగా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. వాస్తవానికి దాసరి కవిత అంటే పెద్దగా ఎవరికి తెలియదు.. కానీ జుమ్ చక జుమ్ చక స్టార్ కవిత అంటే యూట్యూబ్లో వీడియోలు కో కొల్లలుగా కనిపిస్తాయి. జుమ్ చక జుమ్ చక స్టార్ కవిత యూట్యూబ్ ఛానల్‌లో కంటెంట్ లేకపోయినా కామెడీగా ఉంటుందని ఆమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.
యూట్యూబ్లో అభిమానుల అండ చూసుకొనో? లేక బర్రెలక్క స్ఫూర్తితోనో? ఏపీలో రాబోయే ఎన్నికల్లో ధర్మవరం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారామె. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి సవాలు కూడా చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గం అంతా తిరిగే కేతిరెడ్డి తన గ్రామం డీ.చర్లోపల్లి వచ్చి గడపగడపకు తిరగాలని సవాల్ విసిరారు. ధర్మవరంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతానని య్యూట్యూబర్ కవిత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..