AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yemmiganur Politics: పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే ఎర్రకోట.. బీసీ వర్గానికి అవకాశమిచ్చిన చెన్నకేశవరెడ్డి

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అభ్యర్థి ఎంపికలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం విడుదల అయినా జాబితాలో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సూచించిన మాచాని వెంకటేష్ పేరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా ఖరారు అయ్యింది. ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జ్‌గా మాచాని వెంకటేష్‌ను పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది.

Yemmiganur Politics: పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే ఎర్రకోట.. బీసీ వర్గానికి అవకాశమిచ్చిన చెన్నకేశవరెడ్డి
Yemmiganur Politics
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jan 03, 2024 | 11:42 AM

Share

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అభ్యర్థి ఎంపికలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం విడుదల అయినా జాబితాలో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సూచించిన మాచాని వెంకటేష్ పేరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా ఖరారు అయ్యింది. ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జ్‌గా మాచాని వెంకటేష్‌ను పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే కేశవ రెడ్డిని కాదని వెంకటేష్‌కు ఇవ్వడం పట్ల హాట్ టాపిక్ అయింది

చేనేతపురిలో నేతన్న కుర్ని సామాజికవర్గం అధికంగా ఉన్న బీసీ కోట కింద చేనేతలనే నియమించాలనే నేపథ్యంలో మాచని వెంకటేష్ పేరు ఖరారయ్యింది. ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశావరెడ్డి 85 ఏళ్ల వయస్సులో ఎన్నికల రంగంలో తిరగలేడనే తన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు సీటు కేటాయించాలని చాలాసార్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే పార్టీ పెద్దలు ఎమ్మిగనూరు టికెట్ బీసీలకే అని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పడంతో అందరూ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు పగ్గాలు దొరకవచ్చని ఊహించారు. అలాంటి ఊహలకు తెరపడింది.

మాచాని వెంకటేష్ పేరు ప్రకటన వెనుక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి భీష్మించుకున్న నేపథ్యంలో ఆయన సూచించిన వ్యక్తికే ఇంఛార్జ్‌గా ఇవ్వక తప్పలేదు. వీరశైవ లింగాయిత్ చైర్మన్ వై. రుద్రగౌడు, మాజీ ఎంపీ బుట్టా రేణుక పేర్లు మొదటగా పార్టీ పెద్దలు ప్రస్థావనలోకి తెచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వివిధ సందర్భాల్లో జరిగిన చర్చల్లో ఎమ్మెల్యే ఎర్రకోట వారిరువురికి సీటు కేటాయిస్తే, తన మద్దతు ఉండదని, అంతేకాక తాను కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని తేల్చి చెప్పడంతో హైకమాండ్ డైలామాలో పడిందట. ఎట్టకేలకు మూడు రోజులుగా దారాలంగా వ్యాపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. పట్టువీడని విక్రమార్యునిలా తన పంతం నెగ్గించుకుని ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో హౌసింగ్ ప్లానర్లలో ఒకరైన మాచాని వెంకటేష్ ను ఇంఛార్జ్‌గా నియమిస్తూ జాబితా విడుదల చేశారు. ఎమ్మిగనూరు సీటు ఆశించిన వీరశైవ లింగాయిత్ చైర్మన్ రుద్రగౌడ, బుట్టా రేణుక‌కు భంగపాటు తప్పలేదు.

ఇక ఎమ్మిగనూరు పట్టణంలో మాచని వెంకటేష్‌కు మంచి పట్టుంది. రాజకీయాల్లో తన తండ్రి మాచాని నాగరాజు మాజీ మంత్రి దివంగత బివి మోహన్ రెడ్డి అనుచరునిగా కొనసాగారు. అక్కడి నుండి బయటకు వచ్చిన మాచాని వెంకటేష్ తండ్రి నాగరాజు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి్కి అనుచరులుగా ఉంటూ వచ్చారు. చేనేతల ఓటు బ్యాంకు ఉన్న ఎమ్మిగనూరులో ఇది రెండవ సారి చేనేత వర్గాలకు చెందిన వ్యక్తికి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ తరపున నిలిచిన 1989 ఎన్నికల్లో మాచాని శివన్న మాజీ మంత్రి బివి మోహన్ రేడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా మరోసారి నేతన్నల వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మిగనూరు ఇంఛార్జ్‌గా అవకాశం దొరికింది. అయితే ఎన్నికల బరిలో మాచాని వెంకటేష్ బి ఫారం దక్కించుకుంటే గెలుపు బాధ్యత అంతా ఎమ్మెల్యే ఎర్రకోటపైనే ఉంటుంది..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…