YS Jagan: ఏపీలోని వృద్ధులకు గుడ్ న్యూస్.. వైఎస్ఆర్ పింఛన్ కానుకను ప్రారంభించిన సీఎం జగన్.. లైవ్ వీడియో..

YSR Pension Kanuka: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ కాకినాడలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాగా, పింఛన్‌ కానుక కింద ప్రస్తుతం రూ.2750 ఇస్తున్నారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 03, 2024 | 11:54 AM

YSR Pension Kanuka: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ కాకినాడలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాగా, పింఛన్‌ కానుక కింద ప్రస్తుతం రూ.2750 ఇస్తున్నారు. ఈ పింఛన్‌ను రూ.3 వేలకు పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్‌జెండర్స్‌, వితంతువులకు పెన్షన్‌ అందిస్తూ వస్తున్నారు. పెంచిన పింఛన్ల పంపిణీ ప్రజాప్రతినిధుల సమక్షంలో జనవరి 1 నుంచి 8వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..