AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా నాన్న మాకు కావాలి.. మరో మహిళతో ఇల్లీగల్‌గా..’ రచ్చకెక్కిన దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గొడవలు

అసెంబ్లీ ఎన్నికల ముందు రచ్చకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా.. ఇప్పుడు మరింత రచ్చకెక్కింది. దువ్వాడ దంపతుల కథలోకి ఇప్పుడు మరో మహిళ ఎంటరైంది. దాంతో, దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్‌ నెక్ట్స్‌ లెవల్‌కి చేరి.. రచ్చరచ్చ అవుతోంది.

'మా నాన్న మాకు కావాలి.. మరో మహిళతో ఇల్లీగల్‌గా..' రచ్చకెక్కిన దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గొడవలు
Tekkali
Ravi Kiran
|

Updated on: Aug 09, 2024 | 8:34 AM

Share

అసెంబ్లీ ఎన్నికల ముందు రచ్చకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా.. ఇప్పుడు మరింత రచ్చకెక్కింది. దువ్వాడ దంపతుల కథలోకి ఇప్పుడు మరో మహిళ ఎంటరైంది. దాంతో, దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్‌ నెక్ట్స్‌ లెవల్‌కి చేరి.. రచ్చరచ్చ అవుతోంది. నిన్న రాత్రి దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటికి వచ్చిన ఇద్దరు కూతుర్లు.. అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. నాన్నను కలవాలంటూ అర్ధరాత్రి వరకు గేటు ముందు నిరీక్షించారు. ఇంటి గేట్లు తీయకపోవడంతో నాలుగైదు గంటలపాటు పడిగాపులు పడ్డారు. ఎంతకీ గేట్లు తెరవకపోవడంతో ఇక చేసేదిలేక వెనుదిగిరి వెళ్లిపోయారు దువ్వాడ ఇద్దరు కూతుర్లు.

మా నాన్న మాకు కావాలంటోన్న దువ్వాడ కూతుర్లు.. మరో మహిళతో ఇల్లీగల్‌గా ఉంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏ హక్కుతో ఆమె మా ఇంట్లో ఉంటోందని ప్రశ్నించారు. ఆమె మాయలోపడిన నాన్న.. తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా, మెసేజ్‌లు చేసినా నాన్న స్పందించడం లేదంటున్నారు దువ్వాడ కూతుర్లు. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో దువ్వాడ ఫ్యామిలీలో గొడవలు బయటపడ్డాయ్‌. ఎన్నికలకు ముందు టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా దువ్వాడ శ్రీనివాస్‌ను తొలగించి… దువ్వాడ వాణిని నియమించడం పెనుసంచలనమే సృష్టించింది. మళ్లీ ఏమైందోఏమో ఎన్నికల టైమ్‌కి దువ్వాడ శ్రీనివాస్‌కే టికెట్‌ కేటాయించారు. దాంతో, భార్యాభర్తల మధ్య వార్‌ మరింత ముదిరింది. అప్పటికే వేర్వేరుగా ఉంటోన్న దువ్వాడ దంపతులకు మధ్యలోకి మరో మహిళ వచ్చిచేరింది. ఇదే ఇప్పుడు కొత్త రచ్చకు దారితీసింది.

దివ్వెల మాధురిపై ఆరోపణలు చేశారు దువ్వాడ కూతుర్లు. తమ నాన్నను ఆమె ట్రాప్‌ చేసిందన్నారు. ఇలాగే, చాలామందిని ట్రాప్‌ చేసిందని.. ఓ పోలీస్‌ ఆఫీసర్‌తో కూడా ఆమెకు సంబంధం ఉందంటున్నారు దువ్వాడ కూతుర్లు. ఆల్రెడీ పెళ్లై.. పిల్లలున్న మాధురి.. తమ ఇంట్లో ఏ హక్కుతో ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..