Andhra Pradesh: ‘తగ్గడం’ అంటే ప్యాకేజీల కోసమేనా? పవన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన మల్లాది విష్ణు..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పార్టీల మధ్య పొత్తుల
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. పొత్తులకు సంబంధించి తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ పొత్తుల వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా స్పందించారు. పవన్‌పై విమర్శలు గుప్పించారు. పొత్తులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పారు. పవన్ చెప్పిన మూడు ఆప్షన్స్ అంటే ప్యాకేజీ 1, ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 అని అర్థం అంటూ సెటైర్లు వేశారు. పవన్ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల బలాలు కొంత బయటపడ్డాయని అన్నారు. ఆప్షన్‌లు చెప్పడం అంటే బలహీనంగా ఉన్నారనే అర్థం అని వ్యాఖ్యానించారు మల్లాది. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయలేము అనే స్థితిలో జనసేన ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కన్నుకొట్టి పిలిచినా, చప్పట్లు కొట్టి పిలిచినా, అసలు పిలవకపోయినా వెళ్లేలా పవన్ ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహాకూటమి లా కలిసి వెళ్ళాలి అనుకోవడం వాళ్ళ అవివేకానికి, వెర్రితనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. జనసేనకు ఒక సిద్దాంతం, ఆశయం, లక్ష్యం ఏదీ లేదని దుయ్యబట్టారు. టీడీపీ తగ్గాలని పవన్ మాట్లాడడం ప్యాకేజీల కోసమేనని విమర్శించారు. వైసీపీ పై సింగిల్ గా పోటీ చేసే శక్తి లేదని జనసేన, టీడీపీ చెప్పకనే చెప్తున్నాయని అన్నారు.