అనంతరపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ కాక కేక పెట్టిస్తోంది. కేతిరెడ్డి- జేసీ మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకీ పీక్ స్టేజీకి చేరుతోంది. తాజాగా కేతిరెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యాంలో పడి జేసీ చస్తే దరిద్రం వదులుతుందంటూ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు తనపై తన కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెడితే.. మ్యూల్యం మీ ఇంటి నుంచే మొదలవుతుందని జేసీ బ్రదర్స్ కు పెద్దారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గత కొంతకాలంగా తాడిపత్రి తగువులాట.. నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉంది. తాజాగా మరోమారు జేసీ సోదరులపై విరుచుకు పడ్డారు.. ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఈసారి కూడా వైసీపీ గెలిస్తే.. జేసీ బ్రదర్స్ బిచ్చమెత్తుకోవల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. తానిక్కడ పాదయాత్ర చేస్తుంటే.. జేసీ అక్కడ తనపై కరపత్రాలు పంచుతున్నట్టు మండిపడ్డారు. జేసీ తాను గెలవకున్నా.. చంద్రబాబు గెలిస్తే చాలని అంటారనీ. అంటే ఆయన మీద ఆయనకు కూడా నమ్మకం లేదని కామెంట్ చేశారు కేతిరెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి తానే పెద్ద రౌడీ అని చెప్పుకుంటున్నారనీ. ప్రతి వైసీపీ కార్యకర్త అంతకన్నా మించిన రౌడీలేనని అన్నారాయన. జేసీ సోదరులపై చర్యలు తీసుకోకుంటే.. తామే ఎస్సీ ఆఫీసు ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు పెద్దారెడ్డి.
కాగా, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్ర నిన్న ముగిసింది. 11 రోజుల పాటు 110 కిలో మీటర్ల మేర ఈ పాదయాత్ర సాగింది. ఈ యాత్ర ముగింపు సభ పెద్దవడుగూరులో నిర్వహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..