Devineni Avinash: దుబాయ్ వెళ్లేందుకు దేవినేని అవినాష్‌ యత్నం.. అడ్డుకున్న ఎయిర్‌పోర్ట్ అధికారులు

వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురైంది. అవినాష్ గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా ఎయిర్‌పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు.

Devineni Avinash: దుబాయ్ వెళ్లేందుకు దేవినేని అవినాష్‌ యత్నం.. అడ్డుకున్న ఎయిర్‌పోర్ట్ అధికారులు
Devineni Avinash
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 16, 2024 | 12:48 PM

వైసీపీ నేత దేవినేని అవినాష్‌ గురువారం రాత్రి దుబాయ్‌ వెళ్లేందుకు యత్నించగా శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. మంగళగిరి రూరల్ పోలీసుల లుకౌట్‌ నోటీసులతో  దేవినేని అవినాష్‌ను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దేవినేని అవినాష్‌ ఇమిగ్రేషన్ సమాచారాన్ని మంగళగిరి పోలీసులకు ఎయిర్‌ పోర్ట్ పోలీసులు తెలియచేయడంతో ప్రయాణానికి అనుమతించొద్దని ఏపీ పోలీసులు సూచించినట్టు సమాచారం. అవినాష్‌ ప్రయాణాన్ని అధికారులు అడ్డుకోవడంతో.. ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగి దాడి ఘటనల్లో దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్‌ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్‌ నిందితుడిగా ఉన్నారు. మూడేళ్ల క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసానికి అవినాష్‌ ప్రధాన నిందితుడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు. తాజాగా ఆయన దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు.  కార్యాలయంలో ఫర్మిచర్ ధ్వంసం చేసి.. అక్కడ పనిచేసే సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపింది. తాము ఫిర్యాదు చేసినా అప్పటి పోలీసులు.. ఈ ఘటనను పట్టించుకోలేదని.. టీడీపీ నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ షురూ అయింది. అప్పటి సీసీటీవీ ఫుటేజ్‌, ఇతర ఆధారాలతో దాడికి పాల్పడినవారిలో పలువురుని గుర్తించి.. అరెస్ట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..