Visakhapatnam: ఊహించని ట్విస్ట్.. కాపునాడు సమావేశానికి వైసీపీ దూరం.. కారణం అదే..
విశాఖ కాపు నాడు సమావేశం నిర్వహణ లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రాధా - రంగా అసోసియేషన్ పేరుతో విశాఖలో నిర్వహించ తలపెట్టిన కాపు నాడు సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీకి...

విశాఖ కాపు నాడు సమావేశం నిర్వహణ లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రాధా – రంగా అసోసియేషన్ పేరుతో విశాఖలో నిర్వహించ తలపెట్టిన కాపు నాడు సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీకి చెందిన నేతలు ఎవరూ హాజరు కావద్దని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. స్టేజ్ పై వైసీపీ నేతలు ఉన్న సమయంలో జై జనసేన నినాదాలు చేస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుందని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా.. సమావేశం కోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే తాజా పరిస్థితుల ప్రభావంతో ఈ మీటింగ్ పూర్తిగా టీడీపీ, జననేస ఆధ్వర్యంలోనే జరుగనుంది.
వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని కాపు సామాజికవర్గం నాయకులు ఇవాళ ( సోమవారం ) విశాఖలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. పార్టీలకు అతీతంగా ఈ సభ జరుగనుంది. విశాఖపట్నం ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ఈ సభ ఏర్పాటు కానుంది. గంటా శ్రీనివాస్ దీనికి నాయకత్వం వహించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గం రాజ్యాధికారాన్ని ఎలా పొందాలనే విషయం మీద ఈ సభలో చర్చించనున్నారు. దీనికి వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇలా అన్ని పార్టీల నాయకులు హాజరవుతారనే ప్రచారం సాగింది. కాగా.. ఇప్పుడు వైసీపీ దూరం కావడం హాట్ టాపిక్ గా మారింది.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.. పార్టీని వీడనున్నారంటూ వచ్చిన వార్తలతో తెలుగుదేశం అప్రమత్తమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైనప్పటి నుంచీ పార్టీకి దూరంగా ఉంటున్న విశాఖ నార్త్ ఎమ్మెల్యే.. అధికార వైసీపీ చేరబోతోన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే గంటా శ్రీనివాస్ ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీకి మెజారిటీ కాపు సామాజిక వర్గ ఓటర్లు జై కొడతారనే అంచనాలు ఉన్నాయి. దీంతో విశాఖలో జరిగే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం