AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆస్పత్రిలో శిశువును వదిలి వెళ్తున్న మహిళలు.. డౌట్ వచ్చి.. ఆరా తీయగా

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి నిప్పులాంటి నిజాన్ని బయట పెట్టింది. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే మృతి చెందిన పసికందు వ్యవహారంలో కన్న తల్లి ప్రధాన నిందితురాలైంది. నాటకీయ పరిణామాలను ఛేదించిన చిత్తూరు 2 టౌన్ పోలీసులు ఈ వ్యవహారాన్ని బయట పెట్టగా..

AP News: ఆస్పత్రిలో శిశువును వదిలి వెళ్తున్న మహిళలు.. డౌట్ వచ్చి.. ఆరా తీయగా
Trenidng
Raju M P R
| Edited By: |

Updated on: Feb 12, 2025 | 1:18 PM

Share

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి నిప్పులాంటి నిజాన్ని బయట పెట్టింది. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే మృతి చెందిన పసికందు వ్యవహారంలో కన్న తల్లి ప్రధాన నిందితురాలైంది. నాటకీయ పరిణామాలను ఛేదించిన చిత్తూరు 2 టౌన్ పోలీసులు ఈ వ్యవహారాన్ని బయట పెట్టగా.. కేసులో ప్రధాన నిందితురాలు గుణ సుందరితో పాటు మరో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే..  తమిళనాడులోని కాట్పాడికి చెందిన గుణసుందరికి ఇద్దరు పిల్లలున్నారు. 17 ఏళ్ల కూతురు, 12 ఏళ్ల కొడుకు ఉన్నారు. 20 రోజుల క్రితం భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే అప్పటికే గర్భం దాల్చిన గుణసుందరికి.. నిన్న పురిటి నొప్పులు రావడం, ఇలాంటి సమయంలో ప్రసవం విషయం బయట పడకుండా చేసే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగానే సోదరి సుమతి, స్నేహితురాలు నళిని, అఖిలతో కలిసి ప్లాన్ చేసింది గుణసుందరి. చిత్తూరులోని నళిని ఇంటికి వచ్చిన గుణసుందరి.. అక్కడే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన మగ బిడ్డను ఎవరికైనా ఇచ్చేందుకు గుణసుందరి, ఆమె సోదరి సుమతి, స్నేహితురాలు అఖిల, నళినిలు సత్యవేడుకు చెందిన గోపి అనే వ్యక్తితో సంప్రదింపులు జరిపారు. ఇందులో భాగంగానే తిరుపతికి చెందిన సుజాత అనే అంగన్వాడీ టీచర్‌తో మాట్లాడింది. తిరుపతి నుంచి బస్‌లో వస్తున్న సుజాతకు బిడ్డను చూపించే ప్రయత్నం చేశారు.

పసిబిడ్డను గుడ్డలో చుట్టి చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకొచ్చింది. అయితే పసికందును తీసుకుని రావడంలో నిర్లక్ష్యం చేయడాన్ని తప్పు పట్టిన సుజాత ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించింది. పసిబిడ్డను జాగ్రత్తగా తీసుకుని రాలేకపోవడంతో శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు గుర్తించారు. ఈ మేరకు దగ్గరలోనే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. శిశువును అక్కడే వదిలి వెళ్లే ప్రయత్నం చేసారు తల్లి సుందరి, ఆమె వెంట వచ్చిన మహిళలు. పసి కందును ఆసుపత్రికి తెచ్చిన వారిపై అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు కథ వెలుగు చూసింది. గుణసుందరితో పాటు మిగతా వారిని అదుపులో తీసుకున్న పోలీసులు అసలు డ్రామాను బయట పెట్టారు. సుందరితో పాటు నళిని, సుమతి, అఖిల, గోపిలను అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎన్టీఆర్ కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
ఎన్టీఆర్ కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..